Year End Roundup 2023: బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివారైన సినీ తారలు

2023 లో చాలామంది సినీ నటులు బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఒకింటివారైన సినీ నటులు ఎవరో ఒకసారి రివైండ్ చేసుకుందాం.

Year End Roundup 2023

Year End Roundup 2023: 2023 లో చాలామంది సినీ నటులు బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి పెళ్లి చేసుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ఉన్న ప్రభాస్, సల్మాన్ ఖాన్, అనుష్కలు మాత్రం పెళ్లి విషయంపై పెదవి విప్పకపోయినా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలను ఓసారి గుర్తు చేసుకుందాం.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి : వరుణ్, లావణ్య తమ సీక్రెట్ లవ్‌కి ఫుల్‌స్టాప్ చెప్పి నవంబర్ 1 న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లికోసం మాత్రం భారీగానే ఖర్చుపెట్టింది మెగా ఫ్యామిలీ.

శర్వానంద్-రక్షితా రెడ్డి : శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి వేడుక జూన్ 3న జైపూర్ లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా జరిగింది. పెళ్లికి వారం ముందు శర్వానంద్ కారు ప్రమాదానికి గురయ్యారు. శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ సర్కిల్ దగ్గర బోల్తా పడింది. శర్వానంద్ స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tollywood : డ్రగ్స్ విషయంలో సినిమా ఇండస్ట్రీని హెచ్చరించిన హైదరాబాద్ కొత్త సీపీ..

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఏడడుగులు నడిచారు. నిశ్చితార్ధానికి ముందు వీరిద్దరు పలు చోట్ల కలిసి కనిపించి వార్తల్లో నిలిచారు. సెప్టెంబర్ 24 న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

కియారా అద్వానీ-సిద్ధార్ధ్ మల్హోత్రా : బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడారు. ఫిబ్రవరి 7న  జైసల్మేర్‌లోని ఓ స్టార్ రిసార్ట్‌లో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. షేర్షా సినిమా టైమ్‌లో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి ఈ ఏడాది ఈ జంట ఒక్కటయ్యారు.

Prashanth Neel : అప్పుడు కేజిఎఫ్.. ఇప్పుడు సలార్.. షారుఖ్ మీద పోటీకి ప్రశాంత్ నీల్..

అమలా పాల్-జగత్ దేశాయ్ : హీరోయిన్ అమలా పాల్ బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్‌ని నవంబర్ 5 న పెళ్లాడారు. కొచ్చిలో వీరి వివాహం జరిగింది. అమలా పాల్‌కు ఇది ద్వితీయ వివాహం.

కార్తీక-రోహిత్ మేనన్ : సీనియర్ నటి రాధ కుమార్తె హీరోయిన్ కార్తీక నవంబర్ 19 న రోహిత్ మేనన్‌తో ఏడడుగులు వేసారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్‌లో కేరళ సంప్రదాయంలో ఈ జంట ఒక్కటయ్యారు.

అభిరామ్-ప్రత్యూష : ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రెండవ కుమారుడు దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూష డిసెంబర్ 7న పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో వీరి వివాహం జరిగింది. దగ్గుబాటి రానాకు తమ్ముడైన అభిరామ్ ‘అహింస’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Tom Curran : మంట‌ను చూసి భ‌య‌ప‌డిన స్టార్ ఆల్‌రౌండ‌ర్‌..! కొద్దిలో మిస్సైంది మామా..!

రాహుల్-అతియా శెట్టి : బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె నటి అతియాశెట్టి, టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ జనవరి 23 న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. ముంబయిలో ఖండాలాలో ఉన్న సునీల్ శెట్టి ఫామ్‌హౌస్ జహాన్‌లో వీరి పెళ్లి జరిగింది.

మానస్-శ్రీజ : బాలనటుడిగా వెండితెరపై అడుగుపెట్టి టీవీ స్క్రీన్ పై మంచి పేరు తెచ్చుకున్న నటుడు మానస్ ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. నవంబర్ 23న విజయవాడకు చెందిన శ్రీజ మెడలో తాళి కట్టారు. విజయవాడ మురళీ రిసార్ట్స్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

మంచు మనోజ్- మౌనిక రెడ్డి : టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఈ ఏడాది మార్చి 3 న పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది ద్వితీయ వివాహం. ఫిల్మ్ నగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లో అతి కొద్ది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది.

నరేష్-పవిత్ర లోకేష్ : నరేష్, పవిత్ర లోకేష్ ఈ ఏడాది పెళ్లి వార్తల్లో సంచలనంగా నిలిచారు. గతంలో ఇద్దరికీ వివాహమైన ఈ జంట సహజీవనంలో ఉన్నారని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారని చర్చ జరిగింది. ఇలా ఈ ఏడాది ఈ సీనియర్ నటులు సైతం మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు