Tollywood : లాస్ట్ మినిట్‌లో రిలీజ్ పోస్ట్ పోన్‌.. టాలీవుడ్‌లో ఎందుకీ ప‌రిస్థితి?

రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేయడం.. లాస్ట్ మినిట్‌లో పోస్ట్‌పోన్ చేయడం.. టాలీవుడ్‌లో (Tollywood) ఇదే జరుగుతోంది కొన్నాళ్లుగా ! దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్న పరిస్థితి.

Movie release postponed at the last minute Why is this happening in Tollywood

Tollywood : రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేయడం.. లాస్ట్ మినిట్‌లో పోస్ట్‌పోన్ చేయడం.. టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది కొన్నాళ్లుగా ! దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్న పరిస్థితి. ఎంతలా అంటే.. ఏ పెద్ద సినిమా విడుదల ప్రకటన వచ్చినా.. ఆలోచనలో పడిపోతున్నారు ఫ్యాన్స్‌. ప్రకటనల వరకు గ్రాండ్‌గా ప్రచారం చేసే మేకర్స్.. ఆఖరి నిమిషంలో వాయిదా వేస్తూ అభిమానులకు నిరాశ మిగిలిస్తున్నారు. వెంకటేష్‌ హీరోగా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం మూవీ.. అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సి ఉంది. ఐతే అది మళ్లీ వాయిదా పడడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం తుస్సుమన్న పరిస్థితి. దీంతో ఎందుకిలా జరుగుతోందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

టాలీవుడ్‌లో కొంతమంది మేకర్స్.. సినిమా రిలీజ్ డేట్‌ను ముందుగానే ప్రకటించి, చివరి నిమిషంలో వాయిదా వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్‌ఎక్స్, ప్రమోషన్స్‌లాంటి అంశాలపై పూర్తి క్లారిటీ రాకముందే.. రిలీజ్ డేట్ ప్రకటించడంతోనే ఈ పరిస్థితి వస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో డేట్ అనౌన్స్‌మెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవడం ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తోందట.

Shiva Jyothi : పింక్ శారీలో చెట్టు కింద యాంక‌ర్ శివ‌జ్యోతి.. ఫోటోలు వైర‌ల్‌..

ఇలా లాస్ట్ మినిట్‌లో సినిమాలు పోస్ట్‌పోన్ అవుతుండటంతో.. అదే సీజన్‌ను టార్గెట్ చేసుకున్న మిగతా సినిమాలపై కూడా ఎఫెక్ట్ పడుతోందనే టాక్ ఉంది. ఒక సినిమా డేట్ మారితే థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ ప్లాన్స్, ప్రమోషన్ షెడ్యూల్స్ వరకు మొత్తం లెక్కలు మారిపోతాచి. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ముందుగానే డేట్స్ ఫిక్స్ చేసుకున్న సమయంలో స్టార్ సినిమాల వాయిదాలు వస్తే వాటి రిలీజ్ ప్లాన్స్ కూడా మార్చుకోవాల్సి వస్తోందట. దీంతో డేట్ ప్రకటించే ముందు పూర్తి క్లారిటీ ఉండాలి.. చివరి నిమిషంలో మార్పులు చేస్తే మిగతా సినిమాల పరిస్థితి ఏంటనే డిస్కషన్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.

వాయిదాలతో మరో ప్రమాదం కూడా ఉంది. ప్రమోషన్‌లు, టీజర్లు, పాటలతో హైప్ క్రియేట్ చేసి.. సరిగ్గా రిలీజ్ దగ్గరపడే సమయానికి వాయిదా ప్రకటించడంతో.. ప్రేక్షకులు కూడా తమ ప్లాన్స్‌ను మార్చుకోవాల్సి వస్తోంది. దీంతో భవిష్యత్తులో ఆ సినిమాపై ఉన్న ఉత్సాహం, క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌. ఒకప్పుడు సినిమా విడుదలకు ఇచ్చిన డేట్‌.. పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యేవారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటన కేవలం ఒక తాత్కాలిక ఆలోచనగా మాత్రమే మారిపోవడం పరిశ్రమ సినీ విశ్వసనీయతని దెబ్బతీస్తుందనే చర్చ జరుగుతోంది.