Movie Success Formula : కటౌట్లు కాదు.. కథే ముఖ్యం..!

ఎలా తీస్తే సినిమా సక్సెస్ (Movie Success Formula) అవుతుంది. దీనికంటూ ఓ ఫార్ములానే లేదు.

Movie Success Formula Toxic Vs Hanuman Ansh

Movie Success Formula : ఎలా తీస్తే సినిమా సక్సెస్ అవుతుంది. దీనికంటూ ఓ ఫార్ములానే లేదు. అసలు అలాంటి ఫార్ములాతో తీసి చేతులు కాల్చుకున్నవాళ్లు బోలెడుమంది. తాజాగా టాక్సిక్ సినిమాకి మెయిన్ పిల్లర్ హీరో యష్.. అతను అంతకి ముందు నటించిన కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ కావడం తప్ప..ఈ సినిమాకి మరో మేజర్ బజ్ ఐటెమ్ లేనే లేదు. హీరోయిన్లు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌లు తప్ప జనాలకు పెద్దగా తెలిసిన వాళ్లూ లేరు. కానీ భారీ బడ్జెట్, పబ్లిసిటీ హంగామాతో ఈ సినిమాపై అంచనాలను పెంచేసారు. రిలీజైన తర్వాత కాడి వదిలేశారు. దీంతో పెట్టిన బడ్జెట్‌లో సగం వచ్చినా ఫుల్ రన్ పూర్తయ్యేసరికి కనీసం పాతికశాతం నష్టం తప్పదనే అంచనాలు ప్రస్తుతానికి ఉన్నాయి.

దీనికి పూర్తి కాంట్రాడిక్షన్‌గా హనుమాన్ అన్ష్ అనే సినిమా వచ్చింది. ఈ రెండింటికీ పోటీ లేదు, పోలికా లేదు. కానీ ఆడియెన్స్‌ మాత్రం తమకి నచ్చితే ముఖ్యంగా కంటెంట్ ఆకట్టుకునేలా ఉంటే అదెంత బడ్జెట్, ఎవరు నటించారు అనే అంశాలను పక్కనబెట్టి ఆదరిస్తారనేది ప్రూవ్ చేసింది. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణమే ‘హనుమాన్ అన్ష్ సినిమాని ఆడియెన్స్ పొగిడేస్తున్నారు. సినిమా థియేటర్లలోకి వచ్చిన సంగతే ఎవరికీ తెలియదు..ఐతే తొలినాళ్లలో కలెక్షన్ల పరంగా కొంత నెమ్మదిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళుతోంది. రూ. 2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పుడు కోట్లాది మంది గుండెలను పిండేస్తూ భక్తి సాగరంలో ఓలలాడిస్తోంది.

Kamakshi Bhaskarla : చిన్న చిన్న విష‌యాల్లోనే ఎంతో ఆనందం.. కాస్త ఆగి.. కామాక్షి భాస్క‌ర్ల ఫోటోలు

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ప్రయాణం, ఆయన సిద్ధాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ‘డివైన్ డీటూర్: దట్ చేంజ్డ్ మై లైఫ్’ పుస్తకం ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది దీనిని తెరకెక్కించారు. శోభినావ్ సత్యా ఈ పాత్రలో నటించారు. పూరి శెడ్గే, పూర్ణిమ తివారీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం, 1930 నాటి ఉత్తర భారతదేశ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.

మొదటి రోజు కేవలం రూ. 10 లక్షల వసూళ్లతో సాదాసీదాగా ప్రారంభమైన ఈ చిత్రం, రోజురోజుకూ అనూహ్యంగా పుంజుకుంది. సాక్నిల్క్ నివేదిక ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ. 21.65 కోట్ల గ్రాస్, రూ. 18.38 కోట్ల షేర్ సాధించింది. అంటే పెట్టిన పెట్టుబడికి తొమ్మిదింతలు లాభం దక్కించుకుంది. నిజానికి ఈ ఒక్క సినిమానే కాదు..మనకి తెలుగులో ఈ మధ్య వచ్చిన.. వస్తున్న కొన్ని సినిమాలు రెండు, మూడు కోట్లలోనే నిర్మిస్తున్నారు. దీంతో లాస్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. కానీ రివార్డ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ తక్కువ బడ్జెట్‌తో తీసే ప్రతి సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పడం కాదు కానీ, కథ..కథనంపై దృష్టి పెట్టకుండా..కేవలం భారీతనంపైనే ఫోకస్ పెడితే..రిజల్ట్ టాక్సిక్ అవుతుందని చెప్పడమే అసలు ఉద్దేశం !