MR King: మిస్టర్ కింగ్.. ఆత్మాభిమానం ఉన్న ప్రతి అబ్బాయి చూడాల్సిన మూవీ!

లెజెండరీ లేడీ డైరెక్టర్ విజయనిర్మల మనవడు, నటుడు నరేశ్‌ కజిన్‌ రాజ్‌కుమార్‌ కొడుకు శరణ్ కుమార్ హీరోగా, శశిధర్‌ చావలి డైరెక్ట్ చేస్తున్న పూర్తి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘మిస్టర్‌ కింగ్‌’. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. హన్విక క్రియేషన్ బ్యానర్‌పై ఈ సినిమాను బి.ఎన్‌.రావు నిర్మించారు.

MR King Movie To Be Watched By Everyone

MR King: లెజెండరీ లేడీ డైరెక్టర్ విజయనిర్మల మనవడు, నటుడు నరేశ్‌ కజిన్‌ రాజ్‌కుమార్‌ కొడుకు శరణ్ కుమార్ హీరోగా, శశిధర్‌ చావలి డైరెక్ట్ చేస్తున్న పూర్తి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘మిస్టర్‌ కింగ్‌’. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. హన్విక క్రియేషన్ బ్యానర్‌పై ఈ సినిమాను బి.ఎన్‌.రావు నిర్మించారు.

ఇక ఈ సినిమాలో యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ హీరోయిన్స్‌గా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను ఈనెల 24న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ.. ‘‘ఆత్మాభిమానం ఉన్న ఓ అబ్బాయి కథ ఇది. ప్రేక్షకుడు తనని తాను హీరోగా చూసుకునే కథ ఈ సినిమా సొంతం. సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి.’’ అని అన్నారు.

కాగా ఇటీవల ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేసినపుడు సినిమా చూసిన ప్రేక్షకులు చివర్లో కన్నీళ్లు పెట్టుకున్నారని చూసిన వారు చెప్పారని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని.. యూత్ విజల్స్ వేసే చాలా బ్లాక్స్ ఇందులో ఉన్నాయని.. సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళినపుడు ప్రతిఒక్కరు చిరునవ్వుతో వెళ్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకు 24న ప్రేక్షకులు పట్టం కట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.