×
Ad

Mrunal Thakur: జిమ్ లో అమ్మాయి అన్న మాటలు.. నాకు ఇంకా గుర్తున్నాయి.. వాచిన కళ్ళతో లేచిన రోజులు

తన కెరీర్ తొలినాళ్ల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).

Mrunal Thakur emotional comments while talking about the early days of his career.

Mrunal Thakur: సీరియల్ ఇండస్ట్రీ నుంచి సినిమాలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యింది. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవడంతో పాన్ ఇండియా లెవల్లో ఈ అమ్మడు క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. సీత పాత్రలో ఆమె నటన అందరికి గుర్తుండిపోయింది. ఆ తరువాత కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కానీ, ఫైనల్ గా బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. ‘ఏడుస్తూ నిద్రపోయి వాచిన కళ్లతో లేచిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. కొన్ని విషయాలపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాకు నేనే చెప్పుకునేదాన్ని. కానీ, ఎక్కడివికి వెళ్లినా వినిపించే కొన్ని కామెంట్స్ ప్రశ్నించుకునేలా చేసేవి. అలాంటి పరిస్థితి దాటాలంటే చాలా ధైర్యం కావాలి. నా చుట్టూ ఉండేవాళ్ళే నన్ను దారుణంగా ట్రోల్‌ చేశారు. కానీ, ఒక రోజు జిమ్‌ లో సన్నగా ఉన్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ‘నేను మీలా అవ్వాలంటే ఏం చేయాలని అడిగింది.

Roshan Meka: ఈమాత్రం స్పీడ్ ఉంటే చాలు.. స్టార్ హీరో అయిపోవచ్చు

అప్పుడే ఫిక్స్ అయ్యాను.. ఎలా ఉన్నా నచ్చేవాళ్లకు మనం తప్పకుండా నచ్చుతామ్ అని. ఒకాకొన సందర్భంలో హీరో అక్షయ్‌ కుమార్‌ ఇచ్చిన సలహా వల్ల నేను చాలా మారాను. ఆయన ఎం చెప్పారంటే.. ట్రోల్స్‌ పట్టించుకోకుండా మీరు మీలానే ఉంటారు అది నాకు చాలా బాగా నచ్చింది. ఇలానే, ఎవరు ఏమన్నా పాటించుకోకుండా వినకుండా ముందుకు కొనసాగాలి అంటూ చెప్పుకొచ్చాడు.

అక్షయ్ సార్ చెప్పిన ఆ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఇప్పటికీ వాటినే అనుసరిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మృణాల్ ప్రెజెంట్ తెలుగులో చేస్తున్న డెకాయిట్. అడవి శేష్ హీరోగా చేస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.