Mrunal Thakur: ప్రేమలో హద్దులు ఉండవు.. కానీ, నేను హద్దులు దాటలేదు.. అంటే మృణాల్ ప్రేమలో ఉన్నట్టా.. లేనట్టా?

ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).

Mrunal Thakur interesting comments about love

  • ప్రేమ గురించి మృణాల్ ఆసక్తికర కామెంట్స్
  • ఇంకా హద్దులు దాటలేదు అంటూ క్లారిటీ
  • సమయం వచ్చినప్పుడు చెప్తానన్న మృణాల్

Mrunal Thakur: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డెకాయిట్’. హాయ్ నాన్న తరువాత చాలా గ్యాప్ తీసుకొని తెలుగులో మృణాల్ చేస్తున్న సినిమా ఇది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేమ, ప్రతీకారం అనే రెండు భిన్నమైన అంశాల చుట్టూ తిరుగుతుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది. ముఖ్యంగా ‘లవ్ అండ్ వార్’ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీతో పాటు వారి మధ్య చోటుచేసుకునే సంఘర్షణను దర్శకుడు చాలా స్పష్టంగా చూపించారు.

Janhvi Kapoor: 15 ఏళ్ళ వయసులోనే.. అశ్లీల సైట్‌లో మార్ఫింగ్ ఫోటోలు.. ఆవేదన వ్యక్తం చేసిన జాన్వీ కపూర్

తాజాగా ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మృణాల్(Mrunal Thakur) మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం, సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘డెకాయిట్’లో తాను పోషించిన సరస్వతి పాత్ర మునుపటి ప్రేమకథల కంటే భిన్నంగా ఉంటుందని ఆమె తెలిపారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఒక వ్యక్తి, ఆ ప్రేమ భగ్నమైనప్పుడు పొందే కోపం, పగ, ప్రతీకారం వంటి భావోద్వేగాలను ఈ పాత్రలో చూడవచ్చని వివరించారు. ప్రేమలో హద్దులు దాటడం అనే అంశంపై స్పందిస్తూ, రియల్ లైఫ్‌లో తన ప్రేమకథ ఇంకా ‘ప్రాసెస్’లోనే ఉందని, సరైన సమయం వచ్చినప్పుడు అందరికీ చెబుతానని క్లారిటీ ఇచ్చారు.

లవ్ అండ్ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అడివి శేష్ యాక్టింగ్, సరస్వతిగా మృణాల్ విభిన్న షేడ్స్, కథలోని మలుపులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక వ్యక్తి ప్రేమలో విఫలమైనప్పుడు పుట్టుకొచ్చే ఆవేశం ఏ స్థాయిలో ఉంటుందో ‘డెకాయిట్’లో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుంది అనేది చూడాలి.