Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ చేతిలో తెలుగు సినిమాలు లేవా? అసలే ఫ్లాప్స్..
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. (Mrunal Thakur)
- Saketh U
- Published on- August 13, 2026 / 09:59 AM IST
Mrunal Thakur
Mrunal Thakur : ఇండస్ట్రీలో సక్సస్, ఫేమ్ రావడం అంత ఈజీ అయిన విషయం కాదు. అయితే ఇక్కడ ఇమ్మిడియేట్‌గా వచ్చిన లక్ కంటే కాస్త ఆలస్యంగానైనా వచ్చిన సక్సెస్‌కే నిలకడ అనేది ఎక్కువుగా ఉంటుంది. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్‌కి దగ్గరైన మృణాల్ ఠాకూర్ పరిస్థితి ఇలానే ఉంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. అయితే హిందీ సీరియెల్స్ నుంచి బిగ్‌స్రీన్‌వైపు అడుగులు వేసిన ఈ మరాఠీ బ్యూటీని ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ చేసింది సీతారామంలోని సీతా మహాలక్ష్మి క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోనూ బిజీ అయింది మృణాల్ ఠాకూర్. ఇక నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్నతో హిట్ కొట్టింది. కానీ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్లాప్ అందుకుంది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత హిందీలో కూడా వరుసగా రెండు ఫ్లాప్స్ వచ్చాయి. తెలుగులో డెకాయిట్ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఆ సినిమా యావరేజ్ గానే నిలిచింది. మధ్యలో ప్రభాస్ కల్కి పార్ట్ వన్ సినిమాలో స్పెషల్ రోల్‌లో కూడా నటించింది.
Also Read : Censor Board : సెన్సార్ బోర్డు టాలీవుడ్ కి షాక్ ఇవ్వబోతుందా? ఇకపై సినిమా రిలీజ్ అయ్యాక..
ఇలా వరుసగా సినిమాలు చేసిన మృణాల్ ఠాకూర్ కి ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు అని తెలుస్తుంది. హిందీలో కూడా ఒక్కటే సినిమా చేతిలో ఉంది. దీంతో ఈ బ్యూటీకి సీతారామంతో వచ్చిన ఫేమ్ కేవలం ఓవర్‌నైట్‌కి మాత్రమే పరిమితమా అనే చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మృణాల్ ఠాకూర్ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. అయితే ఈ మరాఠీ బ్యూటీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ రూమర్ ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉంది.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో హాలీవుడ్ రేంజ్ మేకింగ్ స్టయిల్‌తో అట్లీ తెరకెక్కిస్తోన్న అల్లు అర్జున్ రాకా సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వైరలవుతూనే ఉన్నాయి. ఈ విషయంపై రాకా టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ క్రేజీ న్యూస్ ప్రస్తుతానికి గాసిప్‌కి మాత్రమే పరిమితమయ్యింది. మరి సీతారామంతో ఓవర్‌నైట్ సక్సెస్ అందుకున్న మృణాల్‌కి తెలుగు ఆఫర్ ఎప్పుడు వరిస్తుందో చూడాలి. సినిమా ఛాన్సులు లేకపోయినా యాడ్స్, సోషల్ మీడియాతో మాత్రం రెగ్యులర్ గా కనిపిస్తుంది మృణాల్.
Also See : Tejaswini Vygha : కరేబియన్ దీవుల్లో వెకేషన్.. ఫొటోలు షేర్ చేసిన దిల్ రాజు భార్య..
