LGM Trailer : ట్రైలర్ లాంచ్ చేసిన ధోని.. పెళ్ళికి ముందు అత్తని అర్ధం చేసుకోవాలి అంటున్న కోడలు..

ధోని నిర్మాతగా మారి నిర్మిస్తున్న మొదటి సినిమా LGM. ఈ మూవీ ట్రైలర్ ని ధోని లాంచ్ చేశాడు.

MS Dhoni launch his first production movie LGM Trailer

LGM Trailer : క్రీడా రంగంలో తిరుగులేని ఇమేజ్ ని సొంత చేసుకున్న ధోని.. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ స్థాపించిన ధోని.. సౌత్ లో పలు సినిమాలు తెరకెక్కించనున్నాడు. ఈ క్రమంలోనే తమిళంలో LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే క్యాచీ టైటిల్ తో ఒక సినిమా ప్రకటించి షూటింగ్ కూడా పూర్తి చేశాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Leo : లియోకి గుమ్మడికాయ కొట్టేసిన విజయ్.. టీజర్ అండ్ సాంగ్స్‌తో ప్రమోషన్..

ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan), లవ్ టుడే సినిమాతో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న ఇవానా (Ivana) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేడు చెన్నై లో ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కోసం ధోని కుటుంబంతో సహా చెన్నై చేరుకున్నాడు. ధోని వస్తున్నాడు అన్న విషయం తెలియడంతో ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానులు ఘన స్వగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

CI Swarnalatha : విశాఖ సీఐ స్వర్ణలత హీరోయిన్‌గా సినిమా.. ఆమె కాదు బిగ్ బాస్ నటి అంటున్న డైరెక్టర్..

కాగా ఈ మూవీ ట్రైలర్ ని ధోని రిలీజ్ చేశాడు. పెళ్ళికి ముందు అత్తని అర్ధం చేసుకోవాలి అంటున్న కోడలు ఒక కండిషన్ పెట్టడంతో రెండు ఫ్యామిలీలు కలిసి ఒక టూర్ కి వెళ్లడం, అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురుకున్నారు. చివరిగా అత్తని కోడలు అర్ధం చేసుకుందా అనేది మిగిలిన కథ. హీరో తల్లిగా హీరోయిన్ కి అత్త క్యారెక్టర్ లో నదియా నటిస్తుంది. రమేష్ తమిళమణి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా రమేష్ తమిళమణినే చేస్తున్నాడు. అయితే తెలుగు ట్రైలర్ ని ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం తమిళ ట్రైలర్ ని మాత్రమే రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు