CI Swarnalatha : విశాఖ సీఐ స్వర్ణలత హీరోయిన్‌గా సినిమా.. ఆమె కాదు బిగ్ బాస్ నటి అంటున్న డైరెక్టర్..

2వేల నోట్ల మార్పిడి విషయంలో అరెస్ట్ అయిన సీఐ స్వర్ణలత హీరోయిన్ గా సినిమా. వైరల్ అవుతున్న పోస్టర్.

CI Swarnalatha : విశాఖ సీఐ స్వర్ణలత హీరోయిన్‌గా సినిమా.. ఆమె కాదు బిగ్ బాస్ నటి అంటున్న డైరెక్టర్..

CI Swarnalatha acts in AP 31 number missing movie

Updated On : July 10, 2023 / 7:04 PM IST

CI Swarnalatha : ఇటీవల 2వేల నోట్ల మార్పిడి విషయంలో విశాఖపట్నం సీఐ స్వర్ణలత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అది ఒకటే కాదు అంతకుముందు కూడా ఆమె పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏఆర్‌ హోంగార్డు ఎస్సైగా వర్క్ చేస్తున్న సమయంలో కూడా హోంగార్డు నియామకాల విషయంలో ఆమె అవకతవకలు చేశారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు సినిమా విషయంలో ఈమె పేరు వినిపిస్తుంది. కొన్ని రోజులు క్రితం ఈమె డాన్స్ చేస్తున్న ఒక వీడియో బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యింది.

Bholaa Shankar : అరసవల్లి సూర్య దేవాలయంలో మెహర్ రమేష్ ప్రత్యేక పూజలు.. రీమేక్ సెంటిమెంట్ పై మెగా ఫ్యాన్స్ నమ్మకం..

సీఐ స్వర్ణలతకి సినిమాలు అంటే చాలా ఇష్టమని, ఎప్పటికైనా సినిమాల్లో నటించాలి అనేది తన కోరిక ఉందట. ఇక ఇటీవల ఒక ప్రముఖుడు డాన్స్ నేర్చుకుంటే తాను తీసే సినిమాలో నటించే అవకాశం ఇస్తానని చెప్పడంతో ఒక కొరియోగ్రాఫర్ ని పెట్టుకొని స్వర్ణలత డాన్స్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవి ‘అబ్బని తియ్యని దెబ్బ’ సాంగ్ కి డాన్స్ వేసి వీడియో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Bro : బ్రో సినిమాలో కొత్త పవన్‌ని చూస్తారు.. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.. థమన్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ఇది ఇలా ఉంటే, సీఐ స్వర్ణలత ఆల్రెడీ ‘ఏపీ 31 నంబర్ మిస్సింగ్‌’ అనే సినిమాలో నటిస్తుందని, అందులో కూడా మే పోలీస్ పాత్రే పోషిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఆ సినిమాలో ఆమె పెట్టుబడులు పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సినిమాలోని స్వర్ణలత ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. అయితే దీని పై ‘ఏపీ 31 నంబర్ మిస్సింగ్‌’ సినిమా దర్శకుడు కె వి ఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. తన సినిమాలో హీరోయిన్ సీఐ స్వర్ణలత కాదని, ఆమె కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

CI Swarnalatha acts in AP 31 number missing movie

CI Swarnalatha acts in AP 31 number missing movie

సినిమా నిర్మాణంలో కూడా ఆమెకు ఎటువంటి సంబంధం లేదని, తమ సినిమాకి పెట్టుబడి పెట్టింది ఎం నారాయణ స్వామి అని తెలియజేశారు. రెండవ షెడ్యూల్ లొకేషన్ కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు సిఐ స్వర్ణలతని కలిసినట్లు, ఈ సినిమాలో మహిళలపై జరిగే దౌర్జన్యాలు, అరాచకాల గురించి ఉండడంతో సిఐ స్వర్ణలతకు ఒక మంచి పాత్ర ఇచ్చినట్లు వెల్లడించారు. తమ సినిమాలో హీరోయిన్ బిగ్ బాస్ లహరి అని, సిఐ స్వర్ణలత హీరోయిన్ కాదని పేర్కొన్నారు.