MS Dhoni: సినిమా రంగంలోకి మహేంద్రసింగ్ ధోని..
మహేంద్రసింగ్ ధోని.. క్రికెట్ చరిత్రలో 50 ఓవర్ల ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్ మరియు ICC ఛాంపియన్స్ ట్రోఫీతో సహా మూడు ప్రధాన ICC ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. క్రీడారంగంలో సక్సెస్ ఫుల్ గా నిలిచిన ధోని, ఇప్పుడు సినిమారంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు.
- gum 95921
- Published On : October 10, 2022 / 10:54 AM IST
MS Dhoni To Launch Film Production Company
MS Dhoni: మహేంద్రసింగ్ ధోని.. క్రికెట్ చరిత్రలో 50 ఓవర్ల ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్ మరియు ICC ఛాంపియన్స్ ట్రోఫీతో సహా మూడు ప్రధాన ICC ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ల నుండి రిటైర్ అయ్యిన ధోని.. IPL ఫ్రాంచైజీలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతూ, నాయకత్వం వహిస్తున్నాడు.
MS Dhoni: ఎంఎస్ ధోనీకి నోటీసులిచ్చిన సుప్రీం కోర్ట్
క్రీడారంగంలో సక్సెస్ ఫుల్ గా నిలిచిన ధోని, ఇప్పుడు సినిమారంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు. “ధోని ఎంటర్‌టైన్‌మెంట్” పేరుతో దక్షిణాదిలో ఒక చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు ‘లెట్స్ సినిమా’ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఆదివారం ప్రకటన చేసింది.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ధోని సినిమాలు నిర్మించనున్నాడు.
గతంలో ధోని, అతని భార్య సాక్షితో కలిసి ‘రోర్ ఆఫ్ ది లయన్’, ‘బ్లేజ్ టు గ్లోరీ’, ‘ది హిడెన్ హిందు’ వంటి చిన్న తరహా చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు పూర్తిస్థాయి నిర్మాతగా మారి, చిత్రసీమలోను తన సత్తా చూపడానికి సిద్దమవుతున్నాడు. మరి కూల్ కెప్టెన్ గా మ్యాచ్ ని గెలుపు దిశగా తీసుకెళ్లే ధోని, సినిమారంగంలో ఎంతవరకు రాణించగలడో.
#LetsCinema EXCLUSIVE: Dhoni is launching his film production company in south ‘Dhoni Entertainment’ to produce films in Tamil, Telugu and Malayalam. pic.twitter.com/zgTxzdSynT
— LetsCinema (@letscinema) October 9, 2022
