AGADHA Teaser : గూస్ బంప్స్ తెప్పిస్తున్న అగ‌ధ టీజ‌ర్‌..

ఎంఎస్ రాజు డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న అగ‌ధ మూవీ (AGADHA Teaser) టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

AGADHA Teaser out now

AGADHA Teaser : ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఎంఎస్ రాజు డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న మూవీ అగ‌ధ‌. కామాక్షీ భాస్క‌ర్ల ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. మిస్టిక‌ల్ డివైన్ థ్రిల్ల‌ర్ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ ఆది వ‌రాహ ప్రొడ‌క్ష‌న్స్ పై కాశీ విశాలాక్షి బ‌లుసు నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ న‌టుడు శ్ర‌వ‌ణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజ‌య్ కుమార్ కీల‌క పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Peddi : పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ అక్కడేనా?

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. టీజ‌ర్ ఆద్యంతం అల‌రించింది.