MS Raju : నన్ను ట్రోల్ చేసినా పర్లేదు.. ఆయన పొద్దున్నే కోడిని ముందు పెట్టుకొని.. క్లారిటీ ఇచ్చిన MS రాజు..

నేడు మీడియాతో మాట్లాడిన MS రాజు ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూనే ఎన్టీఆర్ గురించి మరిన్ని విషయాలు తెలిపారు. (MS Raju)

  • Published on- August 11, 2026 / 02:33 PM IST

MS Raju

MS Raju : సీనియర్ నిర్మాత, దర్శకుడు MS రాజు త్వరలో అగధ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్లో MS రాజు మాట్లాడుతూ.. ఈ సినిమాకు నేను కూడా ఎన్టీఆర్ లాగే పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి రెడీ అయి పనిచేసాను. ఎన్టీఆర్ గారి లాగా ఒక్క చికెన్ తినలేదు అంతే అని అన్నారు. అయితే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ని అవమానించారని MS రాజుపై విమర్శలు చేస్తున్నారు.

దీంతో నేడు మీడియాతో మాట్లాడిన MS రాజు ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూనే ఎన్టీఆర్ గురించి మరిన్ని విషయాలు తెలిపారు.

Also Read : Nabha Natesh : హాఫ్ శారీలో నభా నటేష్.. టీవీఎస్ తో పోజులు..

MS రాజు మాట్లాడుతూ.. రామారావు గారికి నేను చిన్నపుడు ఫ్యానిజం చేశాను. మహేష్ బాబుతో సినిమా చేసేటప్పుడు కూడా కృష్ణ గారికి నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పాను. ఎన్టీఆర్ ఫ్యామిలీతో నాకు సినిమా చేసే ఛాన్స్ రాలేదు. మా నాన్న గారికి ఎన్టీఆర్ తో సినిమా తీసే అవకాశం వచ్చింది. దాసరి గారితో సినిమా అనుకున్నారు. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఆ సినిమా జరగలేదు. అప్పట్లో నేను ఆయన ఇంటికి వెళ్లి ఆయన కాళ్లకు దండం పెట్టుకునేవాడ్ని. ఆ సినిమా సమయంలో పొద్దున్నే ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం.

ఎన్టీఆర్ గారు పొద్దున్నే వ్యాయామం ఒక ఇసుక కుప్పను ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎత్తేవాళ్లు. తర్వాత స్నానం చేసి పూజ చేసుకొని వచ్చేవాళ్ళు. ఆ తర్వాత మేము ఉంటే మమ్మల్ని కూడా తినడానికి రమ్మనేవాళ్ళు. మాకు కూడా గారెలు, చికెన్ తెప్పించే వాళ్ళు. ఆయన ఒక మంచి కోడిని ఎదురుగా పెట్టుకొని తినేవాళ్లు. నేను జరిగిందే చెప్తున్నాను. ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్ అయ్యేది అప్పట్లో సోషల్ మీడియా ఉంటే. ఆయన గొప్ప వ్యక్తి. ఆయనలా ఉండాలి అని అనుకున్నాను. ఆయనలా ఉదయాన్నే లేచి పూజ చేసుకొని సినిమా చేశాను చికెన్ ఒక్కటే తినలేదు కాబట్టి ఆ మాట చెప్పాను అంతే. ఎన్టీఆర్ గారి ఆత్మ మాత్రం నన్ను ట్రోల్ చేయదు. మిగతా ఎవరు ట్రోల్ చేసినా నాకు పర్లేదు అని అన్నారు. దీంతో విమర్శలు చేసే వాళ్లకు గట్టిగానే సమాధానం చెప్పారు MS రాజు అని అంటున్నారు.

Also See : Supritha : న‌డి రోడ్డుపై సురేఖ వాణి కూతురు.. న‌టి సుప్రీత క్యూట్ ఫోటోలు వైర‌ల్‌