MS Raju: ఎంఎస్.రాజు కెరీర్‌లో ఎక్కువ లాభాలు తెచ్చిన మూవీ అదేనట!
టాలీవుడ్ లెజెండరీ నిర్మాతల్లో ఎంఎస్.రాజు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన ఈ నిర్మాత....
- Anil Aaleti
- Published On : June 16, 2022 / 06:05 PM IST
Ms Raju Reveals Biggest Profitable Movie In His Career
MS Raju: టాలీవుడ్ లెజెండరీ నిర్మాతల్లో ఎంఎస్.రాజు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన ఈ నిర్మాత, ఆ తరువాత కాలంలో డైరెక్టర్‌గా మారి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఒకప్పుడు ఎంఎస్.రాజు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే, ఆ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ బొమ్మే అనే ముద్ర ఉండేది. ఇక ఇప్పుడు తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన ‘‘7 డేస్ అండ్ 6 నైట్స్’’ అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేశారు.
ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో ఎంఎస్.రాజు పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎంఎస్.రాజు, తాను ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏమిటనే ప్రశ్నకు చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన ‘‘మనసంతా నువ్వే’’ సినిమా ఆయనకు లాభాల పంటను తెచ్చిపెట్టినట్లుగా పేర్కొన్నారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో యూత్ అండ్ ఫ్యామిలీస్‌ను థియేటర్లకు పదేపదే రప్పించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందని ఎంఎస్.రాజు తెలిపారు.
ఈ సినిమాతోనే ఉదయ్ కిరణ్‌కు స్టార్‌డమ్ వచ్చిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు విఎన్.ఆదిత్య తెరకెక్కించగా, ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని ఆయన అన్నారు. ఇకపోతే ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన 7 డేస్ అండ్ 6 నైట్స్ సినిమా ఓ యూత్‌ఫుల్ సబ్జెక్ట్ అని, అది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
