MTV Splitsvilla X6: ప్రేమ వర్సెస్ డబ్బు.. సన్నీ లియోన్ హోస్ట్‌గా క్రేజీ షో.. తెలుగులోనూ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెలుగులోను స్ట్రీమింగ్ కి వచ్చేసిన 'ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా(MTV Splitsvilla X6 )' సరికొత్త సీజన్.
- V Santhosh Kumar
- Published on- May 20, 2026 / 08:21 PM IST
MTV Splitsvilla new season available for streaming in Telugu.
- తెలుగులో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా’ సరికొత్త సీజన్
- ప్రేమ, డబ్బు మధ్య ఆసక్తికర పోరాటం
- సన్నీ లియోన్, కరణ్ కుంద్రా హోస్టింగ్
MTV Splitsvilla X6: భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ యూత్ డేటింగ్ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా(MTV Splitsvilla X6)’ సరికొత్త ట్విస్టులతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక షో 16వ సీజన్‌ను ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6: ప్యార్ యా పైసా’ పేరుతో ఘనంగా ప్రారంభించారు. చరిత్రలోనే మొదటిసారిగా ఈ షో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమైంది. మే 12 నుండి ప్రతి వారం శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటలకు ‘జియో సినిమా’, ఎమ్‌టీవీ ఛానల్‌లో ఇది ప్రసారమవుతోంది.
David Reddy Teaser: గాంధీకి వ్యతిరేకంగా ‘డేవిడ్ రెడ్డి’ పోరాటం.. అంచనాలు పెంచుతున్న టీజర్
తమిళనాడులోని మహాబలిపురం తీర ప్రాంతంలో 33 మంది హాట్ అండ్ సింగిల్ యువతీ యువకులతో ఈ సీజన్ షూటింగ్ జరుపుకుంది. ఈసారి షోలో కంటెస్టెంట్లను ‘ప్యార్ విల్లా’ (ప్రేమ), ‘పైసా విల్లా’ (డబ్బు) అనే రెండు విభాగాలుగా విభజించారు. ప్రేమ, డబ్బు మధ్య జరిగే ఈ ఆసక్తికరమైన పోరాటంలో ఎవరు గెలుస్తారనేది ఈ సీజన్ ముఖ్య కథాంశం. గత సీజన్ ముగింపులో కంటెస్టెంట్లు దిగ్విజయ్, కాశిష్ వదిలివెళ్లిన ఉత్కంఠభరితమైన మలుపు ఆధారంగా ఈ కొత్త కాన్సెప్ట్‌ను రూపొందించారు.
ఈ భారీ రియాలిటీ షోకు ‘క్వీన్ ఆఫ్ హార్ట్స్’ సన్నీ లియోన్, ‘కింగ్ ఆఫ్ హార్ట్స్’ కరణ్ కుంద్రా హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి తోడుగా షోలో డ్రామా, ట్విస్టులను పెంచడానికి ‘మిస్చిఫ్ మేకర్స్’గా నియా శర్మ, ఉర్ఫీ జావేద్ రంగంలోకి దిగారు. ప్రస్తుత తరం యువతలో ప్రేమ, బంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా మారుతున్నాయో ఈ షో ప్రతిబింబిస్తుందని, ‘ప్యార్ యా పైసా’ అనే ట్విస్ట్ కంటెస్టెంట్ల భావోద్వేగాలకు పెద్ద పరీక్షగా నిలవబోతుందని హోస్ట్ సన్నీ లియోన్ పేర్కొన్నారు.
