Mufasa – Mahesh Babu : వాయిస్‌తోనే రికార్డ్ సెట్ చేసిన మహేష్ బాబు.. ‘ముఫాసా’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

మహేష్ బాబు ఫ్యాన్స్ ముఫాసా సినిమాని సెలబ్రేట్ చేసుకున్నారు.

Mufasa Movie Telugu Version gets Good Collections due to Mahesh Babu Voice

Mufasa – Mahesh Babu : మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఒప్పుకోవడంతో ఆ సినిమాలు చాలా సమయం పట్టనుంది. దీంతో ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ ని అలరించడానికి తన వాయిస్ తో ముఫాసా సినిమాతో వచ్చాడు మహేష్. ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన ముఫాసా సినిమా ఇటీవల డిసెంబర్ 20న రిలీజయింది.

డిస్నీ యానిమేషన్ సినిమాలకు ఇండియాలో కూడా మంచి మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా కొన్ని లోకల్ భాషల్లో ముఫాసా సినిమాని రిలీజ్ చేసారు. ఈ క్రమంలో తెలుగులో ముఫాసా మెయిన్ లీడ్ సింహం పాత్రకు మహేష్ బాబు తో వాయిస్ డబ్బింగ్ చెప్పించారు. అలాగే మహేష్ కూడా ముఫాసాని ప్రమోట్ చేశాడు.

Also See : దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. పుష్ప 2 స్లోగన్ సాంగ్ రిలీజ్..

దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ముఫాసా సినిమాని సెలబ్రేట్ చేసుకున్నారు. థియేటర్స్ లో మహేష్ బాబు వాయిస్ నే ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబుకి కటౌట్స్ పెట్టి హడావిడి చేసారు. జస్ట్ వాయిస్ ఇచ్చినందుకే ఈ రేంజ్ సెలబ్రేషన్స్ అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే మహేష్ వాయిస్ ఈ సినిమా బిజినెస్ కి తెలుగులో బాగా కలిసొచ్చింది.

తెలుగులో ముఫాసా సినిమా 2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే 3 కోట్ల షేర్ అంటే ఆల్మోస్ట్ 6 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. అయితే ముఫాసా సినిమా రిలీజయిన నాలుగు రోజుల్లో తెలుగులో 7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. అంటే ముఫాసా బ్రేక్ ఈవెన్ అయి క్లీన్ హిట్ అయినట్టే.

Also Read : Pushpa 2 : బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. 3Dలో అలరించేందుకు వచ్చేసిన పుష్ప 2..

దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీకెండ్ పెద్దగా సినిమాలు లేకపోవడం, క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉండటంతో ముఫాసా తెలుగు వర్షన్ మరింత కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికాలో కూడా ముఫాసా తెలుగు వర్షన్ ని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇండియా మొత్తం ముఫాసా సినిమా ఆల్మోస్ట్ 45 కోట్లకు పైగా గ్రాస్ కేసూలు చేసింది.

హిందీలో ముఫాసాకు షారుఖ్ ఖాన్ వాయిస్ ఇవ్వడంతో కేవలం హిందీ వర్షన్ 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తానికి హాలీవుడ్ యానిమేషన్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వడంతో బాగా కలిసి వచ్చింది అని ఫ్యాన్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.