Adipurush : ఆదిపురుష్ టీంని నిలబెట్టి కాల్చేయాలి.. శక్తిమాన్ నటుడు ముకేష్ ఖన్నా..
ఆదిపురుష్ మూవీ పై శక్తిమాన్ నటుడు ముకేష్ ఖన్నా మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిపురుష్ మూవీ టీం మొత్తాన్ని..
- gum 95921
- Published On : June 21, 2023 / 02:45 PM IST
Mukesh Khanna viral comments on Prabhas Om Raut Adipurush
Mukesh Khanna – Adipurush : ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రోజురోజుకు వివాదాల్లో కురుకుంటుంది. ఈ సినిమాకి ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించగా మనోజ్ ముంతషీర్ రైటర్ గా పని చేశారు. రామాయణ కథాంశం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది. చిత్రంలోని దేవుని పాత్రలు వేషధారణ, మాటలు అభ్యంతరకర రీతిలో ఉండడంతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతుంది. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యిన దగ్గర నుంచి మూవీ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వస్తున్న ముకేష్ ఖన్నా మరోసారి విరుచుకుపడ్డారు.
Adipurush Controversy : ఇది మన రామాయణం కాదు.. వెంటనే బ్యాన్ చేయండి.. ప్రధాని మోదీకి లేఖ
“రామాయణాన్ని మీ సొంత వెర్షన్ లో తెరకెక్కించడానికి మీరు వాల్మీకి కంటే గొప్పవారా? ఓం రౌత్, మనోజు ముతాషిర్ శుక్లా రామాయణాన్ని కనీసం చదివి ఉండరు. రావణుడికి ఎవరు వరం ఇచ్చారో కూడా తెలియదు. హిరణ్యకశిపుడు పొందిన వరాన్ని రావణాసురుడికి అంటగట్టారు. దేవుడైన హనుమంతుడితో అభ్యంతరకర రీతిలో మాట్లాడించిన మనోజు ముతాషిర్ చేష్టలు.. నాకు పిల్లతనంగా ఉన్నాయి. హిందూ ధర్మాల వాళ్ళు చేసిన ఈ అపహాస్యం మరో ధర్మ పై చేస్తారా?” అంటూ ప్రశ్నించారు.
Adipurush : అప్డేట్ అవ్వండిరా అంటారు.. అప్డేట్ అయినా ట్రోల్ చేస్తారు.. ఆదిపురుష్ డిస్ట్రిబ్యూటర్!
ఆదిపురుష్ టీం చేసిన చేసిన పని తానూ అసలు క్షమించమని, ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినందుకు మొత్తం టీంని 50 డిగ్రీల సెల్సియస్ లో నిలబెట్టి కాల్చేయాలి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ మూవీ ని బ్యాన్ చేయాలంటూ ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) లేఖ రాసింది. తాజాగా రైటర్ మనోజ్ ఏమో.. హనుమంతుడు దేవుడే కాదు అంటూ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యతిరేకతతో మూవీ కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయాయి.
