Mukku Avinash : ముక్కు అవినాష్‌ భార్య సీమంతం వీడియో చూశారా.. మెహందీ కాన్సెప్ట్ అదుర్స్..

త‌న స్నేహితురాలైన 'అనూజ‌'ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ జర్నీ స్టార్ట్ చేసిన ముక్కు అవినాష్‌ ఇటీవల తండ్రి కాబోతున్న శుభవార్తని తెలియజేశాడు. తాజాగా..

Mukku Avinash wife Anuja Baby Shower function video

Mukku Avinash : జబర్దస్త్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్ ముక్కు అవినాష్. ఆ తరువాత బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరికొంత ఫేమ్ ని అందుకున్నాడు. ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు యూట్యూబ్ ఛానల్ నడుపుతూ సక్సెస్ ఫుల్ గా ముందుగా సాగుతున్నాడు. ఇక 2021 చివరిలో త‌న స్నేహితురాలైన ‘అనూజ‌’ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ జర్నీ కూడా మొదలు పెట్టాడు. ఇటీవల తాను తండ్రి కాబోతున్న శుభవార్తని కూడా తెలియజేశాడు.

Jailer : జైలర్‌కి సీక్వెల్ రానుంది.. అలాగే ఆ సినిమాలకు కూడా సెకండ్ పార్ట్.. డైరెక్టర్ నెల్సన్ కామెంట్స్

ఆ విషయాన్ని తెలియజేస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశాడు. మొదటిసారి బేబీ గుండె చ‌ప్పుడు విన్నప్పుడు క‌లిగిన ఫీలింగ్‌ను మాట‌ల్లో వర్ణించలేనిది అంటూ త‌న సంతోషాన్ని ఆ వీడియోలో అవినాష్‌ తెలియజేశాడు. ఆ తరువాత మరికొన్ని వీడియోలు కూడా షేర్ చేశాడు. ప్రెగ్నెన్సీ టైములో ఎటువంటి ఫుడ్ తినాలి? ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలి అనే విషయాలను డాక్టర్స్ ద్వారా తెలుసుకొని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికి తెలియజేశాడు. తాజాగా తన భార్య సీమంతం వేడుకకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశాడు.

Bholaa Shankar : రెమ్యూనరేషన్ విషయం చిరంజీవి, నిర్మాత గొడవ నిజమేనా..? వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్..

ఇక ఈ వేడుకలో భాగంగా అవినాష్ తన వైఫ్ అనూజ‌ చేతులకు ప్రత్యేక మెహందీ వేయించాడు. ఈ మెహందీని కూడా నార్మల్ డిజైన్స్ తో కాకుండా ఒక కాన్సెప్ట్ తో వేశారు. ఇద్దరుగా ఉన్న అవినాష్ అండ్ అనూజ ఇప్పుడు ముగ్గురు అవ్వబోతున్నారు అనేది ఆ మెహందీలో చూపించారు. అలాగే పుట్టేది పాప లేక బాబు అనేది తెలియదు కాబట్టి, బాయ్ అండ్ గర్ల్ పిక్ డిజైన్ తో చాలా అందంగా క్రియేటివిటీగా చేశారు. ఒకసారి ఆ మెహందీ డిజైన్ మీరుకూడా చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు