Music Director Koti : సంగీత దర్శకుడు కోటి 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. స్పెషల్ మ్యూజికల్ కాన్సర్ట్..

సంగీత దర్శకుడు కోటి సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. (Music Director Koti)

  • Updated on- September 22, 2026 / 08:19 PM IST

Music Director Koti

Music Director Koti : సంగీత దర్శకుడు కోటి సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ యాభై ఏళ్లలో ఎన్నో బ్లాక్ బస్టర్, క్లాసికల్ పాటల్ని అందించారు. 80, 90వ దశకంలో రాజ్ కోటి కాంబో ఎంత పెద్ద హిట్ అనేది అందరికి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ కోటి యాభై ఏళ్ల సినీ జర్నీని పురస్కరించుకుని మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ – ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ అనే స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్‌ను నవంబర్ 28న నిర్వహించబోతున్నారు. నేడు ఈ ఈవెంట్ ని అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి గెస్ట్ గా హాజరయిన మంత్రి గంగుల కమలాకర్ ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ – ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. నా చిన్నతనంలో కోటి గారి పాటలు చాలా విన్నాను. ఇవాళ ఆయన్ను ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. ఈ యాభై ఏళ్లలో టెక్నాలజీ ఎంతో మారింది. ఒకప్పుడు గ్రామఫోన్‌లో ఆయన పాటలు వినేవాడ్ని. ఆయన మ్యూజిక్, పాటల వల్లే చాలా సినిమాలు హిట్ అయ్యాయి. జెన్ జీ ఆడియెన్స్‌కి ఈ ఈవెంట్‌తో కోటి గారు అంటే ఏంటో తెలుస్తుంది. ఆ ఈవెంట్ కి నేను కూడా వస్తాను అని తెలిపారు.

Also See : Anchor Manjusha : షార్ట్ నిక్కర్‌లో క్యూట్ కళ్లజోడుతో యాంకర్ మంజూష.. ఫొటోలు..

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. నా తండ్రి సాలూరి రాజేశ్వర్ గారికి చెడ్డ పేరు తీసుకు రాకూడదు అని ప్రతీక్షణం ఆలోచిస్తూ పని చేశాను. తరతరాలు గుర్తుండిపోవాలనే ప్రతీ పాటకు పని చేశాను. రాజ్ కోటిగా ఎన్నో అద్భుతమైన పాటల్ని చేశాం. ఆ తర్వాత కోటిగా నా ప్రయాణంలో గొప్ప పాటల్ని ఇచ్చాను. సంగీత ప్రియుల హృదయాల్లో కోటి పాటలు ఎప్పుడూ నిలిచి ఉంటాయి. ఇప్పుడు అలాంటి పాటల్ని ఎవ్వరూ క్రియేట్ చేయలేరు అని ఛాలెంజ్ చేయగలను. మా పాటలకు చిరంజీవి డ్యాన్స్ తోడవ్వడంతో ఇప్పటికీ ప్రజాదరణ దక్కుతోంది. నవంబర్‌లో జరిగే ఈ కాన్సర్ట్‌లో అందరి హృదయాలకు దగ్గరైన పాటల్ని పాడతాం. నా దగ్గర పని చేసిన రెహమాన్, దేవీ శ్రీ ప్రసాద్, తమన్, హారిస్ జయరాజ్ ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉండటం ఆనందంగా ఉంది నేను చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. అందరి హీరోలతోనూ పని చేశాను. సినీ ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చి నా ఈ కాన్సర్ట్‌ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

మంజుల రావు జూపల్లి మాట్లాడుతూ.. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మేం కొన్ని కాలాల పాటే అందరికీ గుర్తుంటాం. కానీ కోటి గారి లాంటి వారు మాత్రం తరతరాలకు గుర్తుండిపోతారు. కోటి గారు ప్రతీ హీరో సినిమాకి పని చేశారు. ఇప్పటి తరానికి ఇది సాధ్యం అవుతుందా అని అన్నారు. మనతో ఎంటర్టైన్మెంట్స్ శోభన్ మాట్లాడుతూ.. కోటి గారి సంగీతంతో పాటు మనం పెరుగుతూ వచ్చాం. ఆయన బీట్ మన హార్ట్ బీట్. ఐదు దశాబ్దాలుగా ఆయన సంగీతాన్ని ఆస్వాధిస్తూనే వస్తున్నాం. ఈ రోజు కోటి గారి కాన్సర్ట్ గురించి ప్రకటిస్తుండటం ఆనందంగా ఉంది అని అన్నారు.

Also See : Kayadu Lohar : ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కర్లీ హెయిర్‌తో చీరకట్టులో ‘కయదు లోహర్’.. ఫొటోలు..