Thaman: మెగాస్టార్ పై నా ప్రేమేంటో చూపిస్తా.. ఊచకోతకు సిద్దమైన తమన్
చిరంజీవి- బాబీ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన తమన్(Thaman).
- V Santhosh Kumar
- Updated on- May 28, 2026 / 08:32 PM IST
Music Director Thaman Interesting Comments About chiranjeevi Mega 158 film
- చిరు-బాబీ సినిమాకు థమన్ మ్యూజిక్.
- మెగాస్టార్‌కు పవర్‌ఫుల్ ‘మెగా మ్యూజిక్’.
- థియేటర్లలో ఊచకోత ఖాయమంటున్న ఫ్యాన్స్.
Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ దూసుకుపోతున్నారు. తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో సినిమా రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం థమన్ ప్రత్యేకత. ఇప్పటికే టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేసి ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఊరమాస్ ఎలివేషన్స్ ఇవ్వాలన్నా, రీసెంట్ పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రానికి గూస్‌బంప్స్ మ్యూజిక్ అందించాలన్నా అది తమన్ కె సాధ్యమైంది.
అయితే, ఇంతమంది స్టార్ హీరోలకు భారీ హిట్స్ ఇచ్చిన థమన్.. మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఇప్పటివరకు తన కెరీర్‌లో ఆశించిన స్థాయిలో పెద్ద మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయారు. గతంలో వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఆశించినంతగా సౌండ్ చేయలేదు. కానీ, ఇప్పుడు మెగాస్టార్-డైరెక్టర్ బాబీ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో చిరంజీవిపై ఉన్న తన అభిమానాన్ని చాటుకోవాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి తమన్(Thaman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మెగాస్టార్‌కి సరైన ‘మెగా మ్యూజిక్’ ఇచ్చే అవకాశం తనకు రాలేదని, కానీ ఈ సినిమాతో చిరుపై తనకున్న ప్రేమేంటో సంగీతం ద్వారా చూపిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తమన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈసారి తమన్ థియేటర్లలో ఊచకోత కోయడం ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ నెట్టింట ఫుల్ ఖుషీ అవుతున్నారు.
