Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా? తన సొంత తోటలో పండించి..
తాజాగా తమన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూతో తన హెల్త్ డైట్ గురించి తెలిపారు. (Thaman)
- Saketh U
- Published on- August 24, 2026 / 08:04 AM IST
Thaman
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ పక్క భారీ సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ, మరో పక్క మ్యూజిక్ టూర్స్, టీవీ షోలు, క్రికెట్ తో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. ఎంత బిజీగా ఉన్నా తమన్ ఎక్కడ కనిపించినా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన శరీర తత్వానికి కాస్త లావుగా ఉన్నా ఎప్పుడూ హెల్తీగా ఉంటూ, అందాన్ని మెయింటైన్ చేస్తూ, యాక్టివ్ గా కూడా ఉంటారు.
తాజాగా తమన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూతో తన హెల్త్ డైట్ గురించి తెలిపారు.
Also See : Tripti Dimri : బాబోయ్.. ప్రభాస్ హీరోయిన్.. బోల్డ్ లుక్స్‌లో బ్లాక్ డ్రెస్‌లో..
తమన్ మాట్లాడుతూ.. నేను దాదాపు ఐదారేళ్లుగా బొప్పాయి తింటున్నా. రోజు ఉదయాన్నే బొప్పాయి తింటాను. బ్రేక్ ఫాస్ట్ కూడా తినను. బొప్పాయి వల్ల పింపుల్స్ రావు, స్కిన్ ర్యాషెస్ రావు. ఫేస్ గ్లో ఉంటుంది. బొప్పాయి విత్తనాలు కూడా మంచిది. బొప్పాయి ఆకుల జ్యూస్ డెంగ్యూ రాకుండా ఉంటుంది. బొప్పాయి విత్తనాలు మనలో ప్లేట్ లెట్స్ పెంచుతాయి.
నాకు ఒక తోట ఉంది. అక్కడ మొత్తం బొప్పాయి చెట్లే ఉంటాయి. ఆర్గానిక్ బొప్పాయి నా ఫామ్ నుంచే వస్తాయి. నేనే కాదు నా స్టూడియోలో అందరూ తింటారు అదే. వాటితో పాటు మజ్జిగా ఎక్కువగా తాగుతాను. నా బాటిల్ లో ఎప్పుడూ మజ్జిగ ఉంటుంది. బ్లాక్ కాఫీ తాగుతాను. విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దొరికే రకరకాల కాఫీ గింజలను తెస్తాను. మధ్యాహ్నం ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాను. నా స్టూడియోలో కిచెన్ కూడా పెట్టాను. ఇద్దరు చెఫ్ లు ఉంటారు. నేనే కాదు నాతో స్టూడియోలో పనిచేసే అందరూ మంచి ఆర్గానిక్ ఫుడ్ అక్కడే కిచెన్ లో తింటారు అని తెలిపారు.
Also See : Nandamuri Deepika : బోనాలు, పలారం బండి వేడుకలో ఎన్టీఆర్ వదినమ్మ.. నందమూరి దీపిక ఫొటోలు..
