ట్విట్టర్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. సాయం గురించే తొలి ట్వీట్.. అభినందించిన పవన్ కళ్యాణ్

  • Publish Date - March 26, 2020 / 06:55 AM IST

కరోనా బాధితులకు అండగా.. పవన్ కళ్యాణ్ రూ. 2కోట్లు ప్రకటించిన కాసేపటికే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కరోనా బాధితుల కోసం రూ. 70లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ట్విట్టర్‌కి దూరంగా ఉన్న రామ్ చరణ్.. లేటెస్ట్‌గా ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, ఇప్పుడు రామ్ చరణ్ @AlwaysRamCharan పేరుతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. 

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇప్పటివరకు ఫేస్ బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఉన్నారు. సినిమా లేదా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని ఈ రెండింటిలోనే షేర్ చేస్తుంటారు. అయితే లేటెస్ట్‌గా ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చ‌ర‌ణ్ త‌న తొలి పోస్ట్ షేర్ చేశాడు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ప్ర‌భుత్వంకి త‌న వంతు సాయం అందించ‌బోతున్న‌ట్టు వెల్లడించాడు. 

పవన్‌ కళ్యాణ్‌ గారిని స్పూర్తిగా తీసుకొని తాను రూ. 70లక్షల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ మొత్తాన్ని కేంద్రం, రెండు తెలుగురాష్ట్రాల సహాయ నిధికి ఇవ్వనున్నట్లు చరణ్‌ వెల్లడించాడు. ఈ ట్వీట్‌ని రీట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ని అభినందించారు. 

See Also |  కరోనాపై పోరాటం: దర్శకుడు త్రివిక్రమ్ సాయం