అందరూ కొత్తవాళ్లతో మైత్రీ మూవీస్ ‘మత్తు వదలరా’

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న సినిమాకు ‘మత్తు వదలరా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. టైటిల్ పోస్టర్ విడుదల చేశారు..

  • Publish Date - October 18, 2019 / 08:36 AM IST

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న సినిమాకు ‘మత్తు వదలరా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. టైటిల్ పోస్టర్ విడుదల చేశారు..

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి ఓ సినిమాను రూపొందించనున్నారు. దాదాపు ఎక్కువ శాతం కొత్తవారు పనిచేయనున్న ఈ సినిమాకు ‘మత్తు వదలరా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

ఎన్టీఆర్, చిరంజీవి సినిమాల స్టిల్స్‌తో పాటు.. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్‌తో డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. రితేష్ రానా డైరెక్టర్‌‌గా ఇంట్రడ్యూస్ అవుతుండగా.. ‘దండాలయ్యా’, ‘పెనిమిటి’ పాటలతో అలరించిన కాల భైరవ సంగీత మందించనున్నాడు.

Read Also : కొరటాల శివ ఆఫీస్‌లో చరణ్

చిరంజీవి (చెర్రీ) – సుమలత నిర్మిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి. కెమెరా : సురేష్ సారంగం, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, సంగీతం : కాల భైరవ, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్.