×
Ad

Naga Babu : బేబీ నిర్మాత SKN, దర్శకుడు సాయి రాజేష్ జనసేన కోసం ఎంతో పని చేశారు..

బేబీ మూవీ సక్సెస్ మీట్ ఈవెంట్ లో నాగబాబు దర్శకుడు సాయి రాజేష్ అండ్ SKN గురించి మాట్లాడుతూ..

  • Published On : July 17, 2023 / 09:28 PM IST

Naga Babu comments on SKN and sai rajesh in baby success meet

Naga Babu – Baby : సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘బేబీ’. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు హీరోయిన్ ఫాదర్ గా చేశాడు. ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. నేడు జులై 17న సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గెస్ట్ గా వచ్చాడు.

Pranitha : మరోసారి భర్త పాదాలకు పూజ చేసి ఫెమినిస్టులకు గట్టి పంచ్ ఇచ్చిన ప్రణీత..

ఈ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ మూవీ టీం మొత్తాన్ని అభినందించాడు. ఇక దర్శకుడు సాయి రాజేష్ అండ్ SKN గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. “వీరిద్దరూ సినిమా వర్క్ పరంగా నాకు చాలా ఇష్టం. ఇంకో లెవెల్ ఆఫ్ ఇష్టం ఏంటంటే.. వీరిద్దరూ మా జనసైనిక్స్. SKN అండ్ సాయి రాజేష్ జనసేన కోసం చాలా పని చేస్తుంటారు. అయితే వీరిద్దరూ బయట పెద్దగా కనిపించరు అంతే. ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నా” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే నిర్మాత అల్లు అరవింద్ ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. “విజయ్ దేవరకొండ తముడిగా ఆనంద్ ఈ సినిమాలో కనిపించలేదు. అతను కూడా ఇప్పుడు ఒక సెల్ఫ్ మెడ్ స్టార్. విజయ్ నువ్వు మీ తమ్ముడికి సరిగ్గా సపోర్ట్ చేస్తే ఒక మంచి నటుడిని ఇండస్ట్రీ ఇచ్చినట్లు అవుతుంది” అంటూ వ్యాఖ్యానించాడు.

Gentleman 2 : 30 ఏళ్ళ తరువాత జెంటిల్‌మెన్ సీక్వెల్.. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్.. హీరో, దర్శకుడు ఎవరో తెలుసా..?

ఇక బేబీ సినిమా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే.. ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికి 23.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనకవసరం లేదు.