Naga Chaitanya-Samantha: చైతూ సెలబ్రేషన్స్.. మరి సామ్ ఎక్కడ?
అక్కినేని ఇంట సంబరాలు చేసుకుంటున్నారు. చైతూ మరోసారి 'లవ్ స్టోరీ'తో సూపర్ సక్సెస్ కొట్టడంతో ఆనందంలో ఉన్నాడు. అక్కినేని కుటుంబానికి కలిసి వచ్చే ప్రేమకథతో సక్సెస్ కొట్టడం కూడా..
- Naresh Mannam
- Published On : September 25, 2021 / 01:45 PM IST
Naga Chaitanya Samantha
Naga Chaitanya-Samantha: అక్కినేని ఇంట సంబరాలు చేసుకుంటున్నారు. చైతూ మరోసారి ‘లవ్ స్టోరీ’తో సూపర్ సక్సెస్ కొట్టడంతో ఆనందంలో ఉన్నాడు. అక్కినేని కుటుంబానికి కలిసి వచ్చే ప్రేమకథతో సక్సెస్ కొట్టడం కూడా చైతూకి మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆనందాన్ని ఇటు కుటుంబంతో పాటు లవ్ స్టోరీ సినిమా యూనిట్ తో కూడా పంచుకున్నాడు. చైతూతో పాటు లవ్ స్టోరీ యూనిట్ అంతా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొంటోంది. సినిమా సక్సెస్ తో అక్కినేని ఫ్యామిలీ స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేసింది.
Naga Chaitanya-Samantha: ఫస్ట్ టైమ్ చైతూ డిస్టర్బ్.. మాటల్లో చూపించేశాడు!
ఈ డిన్నర్ కి లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు గౌరవ అతిథిగా విచ్చేసిన ఆమిర్‌ఖాన్ కూడా హాజరయ్యాడు. ఈ డిన్నర్ లో అక్కినేని కుటుంబం నుండి నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌తోపాటు దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయిపల్లవి హాజరై సరదాగా గడిపారు. ఈ డిన్నర్ కు సంబంధించి ఫొటోలు కూడా బయటకు రావడంతో మరో కొత్త అంశం తెరమీదకి వచ్చింది. అదే ఈ డిన్నర్ లో సమంత మిస్సింగ్ కావడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
Samantha-Naga Chaitanya: విలన్ షేడ్స్ చూపిస్తున్న చై-సామ్!
చాలాకాలంగా సామ్, చైతూల రిలేషన్ పై రకరకాల ప్రచారం జరుగుతుండగా ఇద్దరూ కూడా సూటిగా సమాధానం చెప్పనేలేదు. సమంత అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తే తీవ్రంగా మండిపడుతుంది. తాజాగా చైతూ అయితే ఈ విషయంపై కాస్త ఎమోషనల్ అయ్యాడు. తన పని తాను చేసుకుంటున్నా అందరి కళ్ళు తన కుటుంబం మీదనే ఉన్నాయని కాస్త వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే సమంత హైదరాబాద్ లో లేదని చెన్నైలో ఉంటుందని వార్తలు మాత్రం ఆగడం లేదు.
