Naga Chaitanya : తండ్రికి తగ్గ తనయుడు.. అమ్మాయిల మధ్యలో యువ మన్మధుడు..

టాలీవుడ్ లో ఎంతమంది అందమైన హీరోలు ఉన్నాగాని, మన్మధుడు అనే ట్యాగ్ మాత్రం ఆ కుటుంబానికే దక్కింది.

Naga Chaitanya : యువసామ్రాట్ నాగచైతన్య అక్కినేని అసలైన వారసుడు అనిపించుకుంటున్నాడు. అక్కినేని హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున ఎన్ని మాస్ సినిమాలు తీసినప్పటికీ.. టాలీవుడ్ ఆడియన్స్ లో మాత్రం ఈ హీరోలు మన్మధులుగా గట్టి ముద్ర వేసుకున్నారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరిలో ఈ మన్మధుడు ట్యాగ్ ని చాలామంది అఖిలే సొంతం చేసుకుంటాడని అనుకున్నారు. కానీ ఆ ట్యాగ్ మాత్రం ఇప్పుడు నాగచైతన్యకే సొంతం అవుతుంది.

Game Changer : శంకర్ సినిమా అంటే సాంగ్స్ రేంజ్ వేరు.. పాటలు కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?

చైతన్య కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రేమ కథలతోనే ఆడియన్స్ కి దగ్గరవుతూ వచ్చాడు. దీంతో లేడీస్ లో చైతన్యకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఈమధ్య అయితే చైతన్య తన లుక్స్ తో అమ్మాయిల మనుసు దోచుకుంటున్నాడు. తాజాగా నాగచైతన్య తన కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే పాండిచ్చేరిలో ప్రత్యేక క్లాసులు, శ్రీకాకుళం సాగరతీరంలో మత్స్యకారుల జీవితాలు పై రీసెర్చ్ చేస్తూ పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్నాడు. ఇక ఈ అక్కినేని హీరోని కలిసేందుకు లేడీ ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Naga Chaitanya : మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకి వెళ్లిన నాగచైతన్య.. ఎందుకో తెలుసా..?

ఈక్రమంలోనే నాగచైతన్యతో కొందరు అమ్మాయిలు అందరూ కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫోటో చుసిన నెటిజెన్స్.. “తండ్రికి తగ్గ తనయుడు, యువ మన్మధుడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా చైతన్య తన తదుపరి సినిమాని చందూ ముండేటితో తీయబోతున్నాడు. ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తెరకెక్కబోతుంది. సముద్రంలో వేటకెళ్లిన అనుకోకుండా పాక్ కోస్ట్ గార్డ్‌స్ కి చిక్కి దాదాపు అక్కడే రెండేళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపిన మత్స్యకారుడు పాత్రలో చైతన్య కనిపించబోతున్నాడు. ఈ కథకి ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని యాడ్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Naga Chaitanya in next movie pre prodution work photo viral

 

ట్రెండింగ్ వార్తలు