Naga Chaitanya: అక్కినేని అభిమానులకు ఇక పూనకాలే.. నాగార్జున ఆల్-టైమ్ హిట్ రీమేక్‌లో నాగచైతన్య!
నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేస్తున్న నాగ చైతన్య(Naga Chaitanya).
- V Santhosh Kumar
- Published On : March 21, 2026 / 05:08 PM IST
Naga Chaitanya plans to remake Hello Brother movie
- తండ్రి సినిమాను రీమేక్ చేస్తున్న నాగ చైతన్య
- ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నాగార్జున
- అనిల్ రావిపూడి డైరెక్షన్ లో క్రేజీ రీమేక్
Naga Chaitanya: ఈమధ్య కాలంలో పాత సినిమాలను కాస్త చేంజ్ చేసి రీమేక్ చేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరోసారి అలాంటి కల్ట్ సినిమా రీమేక్ కానుందా అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ అంటే ‘హలో బ్రదర్’ అనే చెప్పాలి. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమాలో కామెడీ టైమింగ్, యాక్షన్, సాంగ్స్ పరంగా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే సినిమాను ఆయన కుమారుడు అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) రీమేక్ చేయబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తండ్రి పోషించిన ద్విపాత్రాభినయాన్ని చైతూ తన స్టైల్‌లో వెండితెరపై ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా రీమేక్ బాధ్యతలను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి అప్పగించాలని చైతన్య భావిస్తున్నట్లు టాక్. ‘హలో బ్రదర్’ లాంటి ఎనర్జిటిక్, కామెడీ ప్రధానంగా సాగే సినిమాను హ్యాండిల్ చేయడంలో అనిల్ రావిపూడి బెస్ట్ అనే చెప్పాలి. ఒరిజినల్ కథలోని ఆ సోల్ మిస్ అవకుండా ప్రెజెంట్ జనరేషన్ ఆడియన్స్‌కు నచ్చేలా మార్పులు చేర్పులు చేయడంలో ఆయనకు మంచి రికార్డ్ ఉంది.
Rajamouli: ధురంధర్ 2పై రాజమౌళి రివ్యూ.. వైరల్ అవుతున్న సుదీర్ఘ పోస్ట్
ఇక నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలియడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం అనిల్ రావిపూడి వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవలే వెంకటేష్- కళ్యాణ్ రామ్ తో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. కాబట్టి, అనిల్ చైతన్య కోసం ఎప్పుడు టైమ్ కేటాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు నాగ చైతన్య కూడా తన నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు విడుదల అయిన వెంటనే అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు నాగ చైతన్య. ఇక అక్కినేని అభిమానులు కూడా తమ యువ సామ్రాట్ ఈ క్లాసిక్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
