Sai Pallavi : ‘తండేల్’ షూట్ నుంచి ఫొటోలు.. సాయి పల్లవి ఒళ్ళో పాపతో క్యూట్ గా..
తాజాగా తండేల్ సినిమా షూటింగ్ నుంచి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసారు.
- Saketh U
- Published On : March 22, 2024 / 12:43 PM IST
Sai Pallavi : నాగచైతన్య(Naa Chaitanya), సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్'(Thandel) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇండియా నుంచి సముద్రంలో వేటకి వెళ్లి తప్పిపోయి పాకిస్థాన్ అధికారులకు చిక్కిన జాలర్ల కథతో ఈ సినిమా రానుంది. ఇందులో చైతన్య ఓ ఫిషర్ మెన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
తాజాగా తండేల్ సినిమా షూటింగ్ నుంచి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసారు. నాగచైతన్య, సాయి పల్లవి, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు..ఈ ఫొటోల్లో ఉన్నారు. ఓ ఫొటోలో తీయబోయే సీన్స్ గురించి చందూ మొండేటి నాగ చైతన్యకు, అల్లు అరవింద్ కి సీరియస్ నమూనా సెటాప్ చూపించి వివరిస్తున్నాడు. ఓ ఫొటోలో చందూ వివరిస్తుంటే సాయి పల్లవి సీరియస్ గా రాసుకుంటుంది.
Also Read : రామ్ చరణ్ RC16 సినిమా పూజా కార్యక్రమం వీడియో చూశారా?
ఇక సాయి పల్లవి మరో మహిళ పక్కన కూర్చొని ఒళ్ళో పాపతో నవ్వుతూ ఉంది. రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో ప్రస్తుతం షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సాయి పల్లవి అలా ఒళ్ళో పాపని కూర్చోపెట్టుకొని నవ్వుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి పల్లవికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో తెలిసిందే. ఇటీవల చాలా రేర్ గా సాయి పల్లవి ఫొటోలు బయటకి వస్తున్నాయి. దీంతో పల్లవి ఇంత అందంగా నవ్వుతున్న ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు.
GA2 పిక్చర్స్ నిర్మాణంలో బన్నీ వాసు నిర్మాతగా తండేల్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం స్పెషల్ గా హైదరాబాద్ లో భారీ పాకిస్తాన్ సెట్ వేసి షూట్ చేస్తున్నారు. ఈ ఫొటోలు షేర్ చేస్తూ త్వరలోనే సినిమా పైనుంచి అప్డేట్స్ ఇవ్వబోతున్నాం అని ప్రకటించారు. నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ తర్వాత కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
Intense, passion-filled and fun ❤️?
Some shoot diaries from the sets of #Thandel ?
Shooting in full swing. Exciting updates soon ✨#Dhullakotteyala ??
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind #BunnyVas @_riyazchowdary… pic.twitter.com/rN2FJSsUoT— Geetha Arts (@GeethaArts) March 22, 2024
