Sobhita Dhulipala – Naga Chaitanya : నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారా?
తాజాగా నేడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.
- Saketh U
- Published On : August 8, 2024 / 09:01 AM IST
Naga Chaitanya Sobhita Dhulipala getting engaged Rumours goes Viral
Sobhita Dhulipala – Naga Chaitanya : నాగ చైతన్య, సమంత గతంలో ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. చైతన్య – సమంత విడిపోయాక ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే సమంతతో విడిపోయాక నాగచైతన్య నటి శోభిత ధూళిపాళతో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి వెకేషన్ కి కూడా వెళ్లారని వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫొటో కూడా వైరల్ అయింది.
Also Read : Pawan Kalyan – Raviteja : పవన్ కళ్యాణ్, రవితేజ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఇదే.. హరీష్ శంకర్ ఏం చెప్పాడంటే..
తాజాగా నేడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. కేవలం కుటుంబ సభ్యుల మధ్యే నాగార్జున ఇంట్లోనే ఈ కార్యక్రమం జరుగుతుందని టాలీవుడ్ లో వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీరిపై రూమర్స్ వచ్చినప్పటి నుంచి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎవరూ స్పందించలేదు. మరి ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ వార్తలపై అయినా స్పందిస్తారో లేదో చూడాలి.
