Pawan Kalyan – Raviteja : పవన్ కళ్యాణ్, రవితేజ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఇదే.. హరీష్ శంకర్ ఏం చెప్పాడంటే..
డైరెక్టర్ హరీష్ శంకర్ ఫ్యాన్స్ తో మాట్లాడగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

Harish Shankar Comments on Pawan Kalyan Raviteja goes Viral
Pawan Kalyan – Raviteja : మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేస్తే ఆ తర్వాత పవన్ నుంచి సినిమాలు వస్తాయో లేదో చెప్పలేము. ఇక మాస్ మహారాజ రవితేజ ఇండస్ట్రీలో మోస్ట్ ఎనర్జిటిక్ పర్సన్. ఇప్పటికి కూడా ఫుల్ ఎనర్జీతో సినిమాలు తీస్తున్నాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. తాజాగా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఫ్యాన్స్ తో మాట్లాడగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
Also Read : SJ Suryah : ఇదేంటి.. నాని సినిమా స్టోరీ మెయిన్ పాయింట్ చెప్పేసిన SJ సూర్య..
ఈ క్రమంలో ఓ అభిమాని మీరు పవన్ కళ్యాణ్, రవితేజ ఇద్దరితో వర్క్ చేసారు కదా.. వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని అడగగా హరీష్ శంకర్ సమాధానమిస్తూ.. ఇద్దరూ ఫెయిల్యూర్ ని కానీ, సక్సెస్ ని కానీ దేన్నీ పట్టించుకోరు, సీరియస్ గా తీసుకోరు అని తెలిపారు. అలాగే చాలామంది రవితేజ, పవన్ కళ్యాణ్ లతో కలిపి ఒక మల్టీస్టారర్ తీయాలని అడగ్గా కుదిరితే కచ్చితంగా ట్రై చేస్తాను అని తెలిపారు హరీష్ శంకర్.
హరీష్ శంకర్ రవితేజతో షాక్, మిరపకాయ్ సినిమాలు తీయగా ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాతో రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీయగా త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీయబోతున్నాడు.