Naga Chaitanya : జూనియర్ బంగార్రాజు అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్గా లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్ సాధించాడు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాపై కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇది కూడా మంచి విజయం సాధిస్తుందని అంతా అనుకుంటున్నారు. .
ఇక ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. నాగ చైతన్య కూడా ఒక వెబ్ సిరీస్ కి ఓకే చెప్పినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా అది కన్ఫర్మ్ చేశారు నాగ చైతన్య. ఈ విషయానికి సంబంధించి నాగ చైతన్య తన ఇంస్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఈ పోస్ట్‌లో ల్యాప్‌టాప్‌లో చైతూ కనిపిస్తూ ల్యాప్‌టాప్‌పై స్క్రిప్ట్‌ను ఉంచారు. ఆ స్క్రిప్ట్ పై ‘దూత.. ఎపిసోడ్ 1’ అని ఉంది. ఇక ఇదే పోస్ట్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కూడా పెట్టారు. ఆ స్క్రిప్ట్ పై ఒక కళ్ళజోడు, పెన్, వాచ్ ని ఉంచారు.
Maha Shivaratri : లాస్ ఏంజిల్స్‌లో భర్త నిక్‌తో కలిసి ప్రియాంక చోప్రా మహా శివరాత్రి పూజలు
అమెజాన్ ప్రైమ్ నిర్మాణంలో నాగ చైతన్య మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘దూత’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇది హారర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా ఉండబోతుంది. చైతూ మొదటిసారి హారర్ జోనర్ లో చేస్తుండటంతో దీనిపై అంచనాలు పెరిగాయి.