Love Oh Love Trailer : ‘లవ్ ఓ లవ్’ ట్రైలర్ రిలీజ్.. తెలంగాణ అమ్మాయి నాగదుర్గ హీరోయిన్‌గా తమిళ సినిమా.. అబ్బాయిలు మిస్ అవ్వకండి..
మీరు కూడా లవ్ ఓ లవ్ ట్రైలర్ చూసేయండి.. (Love Oh Love Trailer)
- Saketh U
- Published on- July 5, 2026 / 06:48 PM IST
Love Oh Love Trailer
Love Oh Love Trailer : తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగమ్మాయి నాగదుర్గ పలు యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగదుర్గ సినిమా హీరోయిన్ గా అవకాశాలు తెచ్చుకుంటుంది. నాగదుర్గ తమిళ్ లో హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా లవ్ ఓ లవ్. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవ్వనుంది.
పవిష్ నారాయణ్, నాగదుర్గ జంటగా సెల్వ రాఘవన్, KS రవికుమార్, వనిత విజయ్ కుమార్.. పలువురు కీలక పాత్రల్లో మగేష్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 10న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. అబ్బాయిలు ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయిల కోసం ఏదైనా చేస్తారు, కొనిస్తారు. అలా చేసి బాధపడ్డ హీరో అమ్మాయిని తన కోసం చేయమని అడిగితే ఏం జరిగింది అనే కథాంశంతో ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.
మీరు కూడా లవ్ ఓ లవ్ ట్రైలర్ చూసేయండి..
