NBK109 : ‘నన్ను క్షమించండి’.. NBK109 టైటిల్ అప్డేట్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..
- Bhanumathi
- Published On : October 30, 2024 / 03:13 PM IST
Naga Vamshi shocking update on NBK109
NBK109 : నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు అన్ స్టాపబుల్ షో కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NBK 109 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చేస్తున్నారు.
దసరాకి ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారని ఎదురుచూసిన ఫాన్స్ కి నిరాశే మిగిలింది. మరి దీపావళికి అనౌన్స్ చేస్తారా అంటే అది కూడా లేదు. తాజాగా ఈ విషయం పై బాంబు పేల్చాడు నిర్మాత నాగవంశీ. తాజాగా లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.
“నిజానికి బాలయ్య NBK 109 సినిమా టైటిల్‌ను పండగకు విజువల్స్‌తో అనౌన్స్ చేద్దామని అనుకున్నాము.
Also Read : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సావిత్రి కూతురు.. ఫొటోస్ వైరల్
కానీ మాకు సీజీ సమయానికి పూర్తవ్వలేదు. అందుకే ఇంకాస్త టైమ్ పడుతుంది. అభిమానులకు సారీ. టైటిల్‌కు విజువల్, బ్యాంగ్‌తో ఇస్తేనే బాగా హైప్ వస్తుందని బాబీ ఇంకా ప్రేత్యేకంగా చేస్తున్నారు. కానీ సీజే వర్క్ టైమ్ వాళ్ళ లేట్ సవుతుంది. నవంబర్ రెండో వారంలో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారం లేదా పది రోజులు సీజీ కోసం టైమ్ కావాలని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
