Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సావిత్రి కూతురు.. ఫొటోస్ వైరల్

Savitri daughter meeting Megastar Chiranjeevi
Chiranjeevi : ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ అవార్డు వేడుకకి మెగాస్టార్, అక్కినేని కుటుంబాలతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిధిగా అమితాబ్ బచ్చన్ వచ్చారు. 2024 గానూ ఏఎన్నార్ జాతీయ అవార్డు పురస్కారం మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఈ సందర్బంగా వచ్చిన వారందరు ఏఎన్నార్ ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : Suriya : ముంబైకి అందుకే షిఫ్ట్ అయ్యాము.. ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన సూర్య..
అయితే ఈ కార్యక్రమానికి మహానటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి సైతం వచ్చారు. మెగా స్టార్ చిరంజీవితో ఆమె కాసేపు మాట్లాడారు. తర్వాత ఆమె మెగాస్టార్ తో సెల్ఫీలు దిగారు. అలా కొద్ది సేపటికి నాగార్జున కూడా వచ్చి చిరంజీవి, విజయ చాముండేశ్వరి అందరినీ కలిపి ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ వేడుకలను అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. ఈ వేడుకకి మెగాస్టార్ తల్లి అంజనమ్మ కూడా వచ్చారు. ఈ వేడుక మొత్తాన్ని ఆమె ముందు వరుసలో కూర్చొని చూసారు.