Suriya : ముంబైకి అందుకే షిఫ్ట్ అయ్యాము.. ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన సూర్య..

Suriya  : ముంబైకి అందుకే షిఫ్ట్ అయ్యాము.. ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన సూర్య..

Suriya clarity on moving to mumbai

Updated On : October 30, 2024 / 12:41 PM IST

Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ‘కంగువా’. నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు టీమ్. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ మూవీకి ప్రమోషన్స్ తెలుగులో కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రస్తుతం వరుస ఇంటర్వూస్ ఇస్తూ బిజీగా ఉన్నారు సూర్య.

Also Read : Janaka Aithe Ganaka : ఆ రోజు నుండి ఆహా ఓటీటీలోకి వచ్చేస్తున్న సుహాస్ ‘జనక అయితే గనక’..

అయితే గతేడాది సూర్య తన భార్య పిల్లలతో చెన్నై నుంచి ముంబైకి ఎందుకు షిఫ్ట్ అయ్యారో క్లారిటీ ఇచ్చారు. జ్యోతిక తన కోసం ఇప్పటివరకు చాలా త్యాగం చేసిందని, తన కోసం జ్యోతిక కుటుంబాన్ని, కెరీర్ ను వదిలేసి వచ్చిందని, తన కోసం ఇన్ని త్యాగాలు చేసిన జ్యోతిక ఇప్పటికైనా తన కుటుంబంతో కలిసి ఉండాలనే చెన్నై నుండి ముంబైకి షిఫ్ట్ అయ్యామని తెలిపారు. తనకోసం కెరీర్, స్నేహితులు, తన బంద్రా లైఫ్‍స్టైల్‍ను వదులుకొని 27 ఏళ్ల క్రితం ముంబై నుంచి చెన్నైకు వచ్చేసిందని అన్నారు.


చెన్నై నుండి ముంబైకి వెళ్ళిపోయినప్పటి నుండి జ్యోతిక తన పేరెంట్స్ తో హ్యాపీగా ఉందని, జ్యోతికకి గౌరవం, జిమ్ టైమ్ బాగా అవసరమని, తల్లిదండ్రుల నుంచి ఆమె సమయాన్ని, ఒకప్పుడు ఇష్టపడిన లైఫ్‍స్టైల్‍ను ఎందుకు దూరం చెయ్యాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సూర్య తెలిపారు. అయితే చెన్నై నుండి ముంబైకి షిఫ్ట్ అయిన సమయంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని అందుకే షిఫ్ట్ అయ్యారన్న రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు సూర్య క్లారిటీతో ఆ రూమర్స్ కి చెక్ పడినట్లే.