Janaka Aithe Ganaka : ఆ రోజు నుండి ఆహా ఓటీటీలోకి వచ్చేస్తున్న సుహాస్ ‘జనక అయితే గనక’..

Janaka Aithe Ganaka : ఆ రోజు నుండి ఆహా ఓటీటీలోకి వచ్చేస్తున్న సుహాస్ ‘జనక అయితే గనక’..

Hero Suhas Janaka Aithe Ganaka Movie has been coming to Aha OTT

Updated On : October 30, 2024 / 11:57 AM IST

Janaka Aithe Ganaka : యంగ్ హీరో సుహాస్ నటించిన సరికొత్త సినిమా ‘జనక అయితే గనక’ అక్టోబర్‌ 12న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి స్పందన అందుకున్న ఈ సినిమాను సందీప్ రెడ్డి బండ్ల‌ తెరకెక్కించారు. సంగీర్త‌న విపిన్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, వెన్నెల కిశోర్‌, ముర‌ళీశ‌ర్మ‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్స్ లో డీసెంట్ హిట్ అందుకొని ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది.

Also Read : Kiran Abbavaram : ట్రోల‌ర్స్‌పై కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫైర్‌..

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో నవంబర్ 8 నుండి సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లకు స్పెషల్‌ ఆఫర్‌.. ఏంటంటే.. 24 గంటల ముందు నుండే ఈ సినిమా చూసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను ఆహాలో వస్తుందని తెలిసి ఎప్పుడెప్పు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.


ఇక ‘జనక అయితే గనక’ సినిమా విషయానికి వస్తే.. పిల్లలు పుడితే ఖర్చు పెరుగుతుందని భయపడే ఓ వ్యక్తి భార్య సడన్ గా నెల తప్పుతుంది. అయితే కండోమ్స్ వాడినప్పటికే తన భార్య ఎలా నెల తప్పుతుందని, ఆ కండోమ్ ఫ్యాక్టరీ పైనే కేసు వేసే వ్యక్తి జీవితం ఎలా సాగుతుంది అన్నదే ఈ సినిమాలో చూపిస్తారు.