Nagababu : గౌరవహీనమైన వ్యక్తులతో నేను వాదించను.. ప్రకాష్ రాజ్ కి మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చిన నాగబాబు..
ఇప్పటికే నాగబాబు దీన్ని ఖండిస్తూ కౌంటర్ ఇవ్వగా తాజాగా ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇస్తూ తన సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. (Nagababu)
- Saketh U
- Updated on- April 18, 2026 / 02:50 PM IST
Nagababu
Nagababu : ప్రకాష్ రాజ్ సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నా సోషల్ మీడియాలో, బయట ఎప్పుడూ హిందూమతంపై, హిందు దేవుళ్లపై, సనాతనధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. సనాతన ధర్మం కోసం నిలబడేవాళ్లపై కూడా విమర్శలు చేస్తూ వైరల్ అవుతున్నాడు. ఇటీవల ప్రకాష్ రాజ్ హిందూ దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. దీంతో దేశవ్యాప్తంగా భక్తులు ప్రకాష్ రాజ్ పై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు.
పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా దీనిని ఖండిస్తున్నారు. ఇప్పటికే నాగబాబు దీన్ని ఖండిస్తూ కౌంటర్ ఇవ్వగా తాజాగా ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇస్తూ తన సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు.
Also Read : Raashii Khanna : పాపం.. హీరోయిన్ కారవాన్‌లోకి దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలుసా?
నాగబాబు తన పోస్ట్ లో.. ప్రకాష్ రాజ్ గారు మీరు మిమ్మల్ని మీరు క్రైస్తవ నాస్తికుడని చెప్పుకున్నప్పటికీ, మీ తల్లిగారి అంత్యక్రియలప్పుడు ఆమె విశ్వాసాన్ని గౌరవించారు. ఒక కొడుకుగా అది మీ కర్తవ్యంగా మేము గౌరవిస్తాము. అదే స్ఫూర్తితో మీరు కోట్లాది మంది నమ్మకాలను గౌరవించాలి. నాస్తికత్వం అంటే దేవుళ్ళను గానీ, విశ్వాసులను గానీ ఎగతాళి చేయడం కాదు, అది ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానం.
హిందూమతం మాత్రమే తన సిద్ధాంతాల ద్వారా నాస్తిక తత్వాన్ని కూడా స్వీకరించిన ఏకైక మతం. అటువంటి సంప్రదాయాన్ని తోసిపుచ్చడం హేతుబద్ధం కాదు, అది అగౌరవం. ఇతర దేశాలలో అయితే ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి ఉండేవి. మీపై ఇది నా సూటి వ్యాఖ్య భవిష్యత్తులో మీలాంటి గౌరవహీనమైన వ్యక్తులతో నేను ఎప్పటికీ వాదించను. విభిన్న విశ్వాస వ్యవస్థలను గౌరవించడమే హేతుబద్ధతకు, బాధ్యతకు నిజమైన నిదర్శనం అంటూ రాసుకొచ్చారు.
Also Read : Priyanka Chopra : వారణాసి షూటింగ్ కి బ్రేక్.. ఇండియా ట్రిప్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక చోప్రా..
