Raashii Khanna : పాపం.. హీరోయిన్ కారవాన్లోకి దొంగలు.. ఏం దోచుకెళ్లారో తెలుసా?
హీరోయిన్ రాశీఖన్నాకు ఈ చేదు అనుభావం ఎదురైంది. (Raashii Khanna)
Raashii Khanna
Raashii Khanna : దొంగతనాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో చెప్పలేము. సినిమా షూటింగ్స్ లో, సినిమా సెలబ్రిటీల ఇళ్ళల్లో కూడా దొంగతనాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ సినిమా షూటింగ్ సెట్ లో దొంగతనం జరిగింది. అది కూడా హీరోయిన్ కారవాన్ లో జరగడం గమనార్హం.
హీరోయిన్ రాశీఖన్నాకు ఈ చేదు అనుభావం ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ లో రాశీఖన్నా కారవాన్ లో దొంగలు పడి తన పర్స్ లో ఉన్న 50 వేల రూపాయలు కొట్టేసారు. షూటింగ్ కి వెళ్లొచ్చే గ్యాప్ లో ఇది జరిగింది. ఇది గమనించిన రాశీఖన్నా మేనేజర్ కి చెప్పడంతో సెట్ లో ఉన్నవాళ్లే ఈ పని చేసి ఉంటారని సెట్ ని లాక్ చేసి దొంగని వెతికారు.
Also See : Priyanka Chopra : వారణాసి షూటింగ్ కి బ్రేక్.. ఇండియా ట్రిప్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక చోప్రా..
తీరా వెతికితే ఆ కారవాన్ డ్రైవరే రాశీఖన్నా పర్స్ నుంచి డబ్బులు కొట్టేసాడట. దీంతో ఆ డ్రైవర్ కి దెబ్బలతో బుద్ది చెప్పి ఆ కారవాన్ సంస్థకు సమాచారం అందించి అతన్ని సెట్ లోంచి పంపించేసారట. సాధారణంగా హీరోయిన్స్ అంత డబ్బుని పర్స్ లో క్యారీ చేయరు. ఆ రోజు షూటింగ్ అయ్యాక ఏదో అవసరం ఉంది అని తెచ్చుకుందట. తీరా చూస్తే దొంగతనం జరిగింది. కానీ చివరకు దొంగని పట్టుకొని ఆ డబ్బులను రాశీఖన్నాకు తిరిగి ఇప్పించారు.
దీంతో ఈ ఘటన సినీ పరిశ్రమలో చర్చగా మారింది. కారవాన్ లో అన్ని పడేసి వెళ్లిపోకూడదు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నారు నటీనటులు.
Also Read : Rashmika Mandanna : పెళ్లి తర్వాత బ్యాంకాక్ లో రష్మిక కష్టం.. కాళ్లకు మెట్టెలతో.. ఏకంగా రోజుకు 8 గంటలు..
