Memu Coplam : ‘మేము కాప్‌లం’ ట్రైలర్ వచ్చేసింది.. సలార్ రాజు మిస్సింగ్..
మీరు కూడా 'మేము కాప్‌లం' ట్రైలర్ చూసేయండి.. (Memu Coplam)
- Saketh U
- Updated on- May 14, 2026 / 12:48 PM IST
Memu Coplam
Memu Coplam : నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘మేము కాప్‌లం’. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాణంలో వికటకవి ఫేమ్ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కుతుంది.
తాజాగా ‘మేము కాప్‌లం’ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. ఓ పల్లెటూరులో సలార్ రాజు అనే పందెం కోడి మిస్ అయితే దానిని వెతకడానికి పోలీసులు ఏం చేసారు అని కామెడీతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో మే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మీరు కూడా ‘మేము కాప్‌లం’ ట్రైలర్ చూసేయండి..
