Venkat : వద్దన్న పని చేసి హీరో, డైరెక్టర్ పైనే కేసు పెట్టిన నటి.. పాపం జైలుకెళ్లిన డైరెక్టర్.. హీరో ఏం చెప్పాడంటే..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో వెంకట్ ఆ సంఘటన గురించి క్లారిటీ ఇచ్చారు. (Venkat)
Venkat
Venkat : ఒకప్పటి హీరో వెంకట్ ఇప్పుడు రీ ఎంట్రీలో మళ్ళీ సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు. వెంకట్ హీరోగా తెరకెక్కిన హరుడు సినిమా మే 15న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ రాజ్ తాళ్లూరి ఓ జూనియర్ ఆర్టిస్ట్ చేసిన ఫిర్యాదుతో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో వెంకట్ ఆ సంఘటన గురించి క్లారిటీ ఇచ్చారు.
Also Read : Tollywood Actress : ఒకప్పుడు స్టేట్ లెవల్ చెస్ ఛాంపియన్.. ఇప్పుడు రీ ఎంట్రీలో బిజీ అయిన హీరోయిన్..
హీరో వెంకట్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఆ రోజు ఎన్ కౌంటర్ కి సంబంధించిన సీన్స్ రిహార్సల్స్ చేస్తున్నాము. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కొత్త అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని నేను కాల్చాలి. మనం వాడేది డూప్లికేట్ గన్ కానీ అది పేలినట్టు స్పార్క్స్ వస్తాయి. ఆ అమ్మాయి నేను గన్ పెట్టగానే గన్ ని పట్టుకుంటుంది. అప్పటికి వద్దు, అలా పట్టుకొవద్దు, టచ్ చేయొద్దు అని చెప్పినా వినకుండా ఏదో పర్ఫార్మెన్స్ చేసేయాలని నా చేతిలో ఉన్న గన్ ని టచ్ చేసింది. దాంతో నుదిటి మీద పాయింట్ బ్లాక్ పెట్టి పేల్చాల్సిన గన్ కంటి దగ్గర పేలింది. ఆ స్పార్క్స్ వచ్చి తన కంటికి టచ్ అయింది.
వెంటనే తనని LV ప్రసాద్ ఐ హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాము. ఒక పది రోజుల్లో రికవరీ అయింది. కానీ ఆ అమ్మాయికి ఎవరు ఏం చెప్పారో తెలీదు రికవరీ అయ్యాక మా మీద కేసులు పెట్టింది. నా మీద, డైరెక్టర్ మీద, ఫైట్ మాస్టర్ మీద, ప్రొడక్షన్ మీద కేసులు పెట్టింది. FIR ఫైల్ అయింది. డైరెక్టర్ ని ఒక రోజు జైలులో కూడా పెట్టారు. బెయిల్ మీద బయటకు తీసుకొచ్చాం. దాంతో మేము లోక్ అదాలత్ కోర్టుకు వెళ్లి అక్కడ జరిగింది చెప్పాము. రిహార్సిల్స్ కూడా మేము షూట్ చేసాము కాబట్టి ఆ ఫుటేజ్ చూపించాము. అది యాక్సిడెంటల్ గా జరిగింది అన్న తర్వాత ప్రూఫ్స్ చూసి వదిలేసారు అని తెలిపాడు.
