Tollywood Actress : ఒకప్పుడు స్టేట్ లెవల్ చెస్ ఛాంపియన్.. ఇప్పుడు రీ ఎంట్రీలో బిజీ అయిన హీరోయిన్..
చిన్నప్పుడు స్టేట్ లెవల్లో తను విజయాలు సాధించినట్టు పేపర్లో వచ్చిన క్లిప్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Tollywood Actress)
Tollywood Actress
Tollywood Actress : మన సినీ నటీనటులలో కేవలం నటన మాత్రమే కాక వేరే రంగాల్లో కూడా ప్రతిభ ఉన్నవాళ్లు ఉన్నారు. తాజాగా ఓ నటి తన చిన్నప్పుడు చెస్ ఛాంపియన్ అంటూ చిన్నప్పుడు స్టేట్ లెవల్లో తను విజయాలు సాధించినట్టు పేపర్లో వచ్చిన క్లిప్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ఒకప్పటి హీరోయిన్ లయ. ఒకప్పుడు హీరోయిన్ గా మంచి సినిమాలు చేసి మెప్పించిన లయ ఆ తర్వాత పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది. ఇటీవలే ఓ రెండేళ్ల క్రితం మళ్ళీ తమ్ముడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో వరుస సినిమాలతో, టీవీ షోలతో బిజీగానే ఉంది లయ.
Also Read : Allu Ayaan : చిన్నవయసులోనే బన్నీ తనయుడు మంచిపని.. అల్లు అయాన్ పై ప్రశంసలు..
తాజాగా లయ చిన్నప్పుడు తను స్టేట్ లెవల్ చెస్ ఛాంపియన్ షిప్ గెలిచినట్టు పేపర్లో పడిన క్లిప్స్ ని షేర్ చేసి ఒకప్పుడు చెస్ ఛాంపియన్ అని తెలిపింది. స్టేట్ లెవల్లో లయ స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు చెస్ ఛాంపియన్ షిప్స్ గెలిచినట్టు గతంలో పలు ఇంటర్వ్యూలలో కూడా తెలిపింది. తన కూతురు శ్లోకకు కూడా చెస్ లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపింది. దీంతో లయని అభినందిస్తున్నారు.
