×
Ad

NagaBabu – Pawan Kalyan : నాగబాబు కొత్త ఆఫీస్ ఓపెనింగ్.. ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్ ఫోటో ఫ్రేమ్ వైరల్..

తాజాగా ఈ N మీడియా కోసం నాగబాబు ఓ కొత్త ఆఫీస్ ని ఓపెన్ చేసారు.

  • Published On : August 12, 2024 / 08:40 AM IST

Nagababu N Media New Office Opening Pawan Kalyan Photo Frame goes Viral

NagaBabu – Pawan Kalyan : మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల N మీడియా ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి N మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ కూడా పోస్ట్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్స్ తో ఈ N మీడియా రన్ అవ్వనుంది.

Also Read : Bigg Boss 8 : బిగ్‌బాస్ 8 ప్రోమో చూశారా? పవన్, మహేష్ స్టైల్లో నాగార్జున..

తాజాగా ఈ N మీడియా కోసం నాగబాబు ఓ కొత్త ఆఫీస్ ని హైదరాబాద్ లో ఓపెన్ చేసారు. నాగబాబు జనసేన పార్టీ పనుల్లో బిజీగా ఉండి రాలేకపోవడంతో నాగబాబు భార్య, కూతురు నిహారిక కలిసి ఈ N మీడియా ఆఫీస్ ని ప్రారంభించారు. ఈ ఆఫీస్ ఓపెనింగ్ వీడియోని తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో ఆఫీస్ ఓపెనింగ్, ఆఫీస్ ఎలా ఉందో చూపించారు. ఆఫీస్ లో గోడల మీద సినిమా పేర్లు, మెగా ఫ్యామిలీ సినిమాల పోస్టర్స్ అతికించి సరికొత్తగా తయారుచేసారు. అయితే N మీడియా కొత్త ఆఫీస్ లో ఓ గోడకి పవన్ కళ్యాణ్ ఫోటో ఫ్రేమ్ పెట్టారు. ఒక అభిమాని గీసిచ్చిన పవన్ కళ్యాణ్ స్కెచ్ ని ఫోటో ఫ్రేమ్ చేయించి పెట్టారు. దీంతో ఈ వీడియోలో పవన్ ఫోటో ఫ్రేమ్ వైరల్ గా మారింది. ఆఫీస్ ఓపెనింగ్ వీడియో మీరు కూడా చూసేయండి..

https://www.youtube.com/watch?v=1ywp7YXGZBg

ఈ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడు అంటే నాగబాబుకి ఎంత ప్రేమో మరోసారి చూపించారని అంటున్నారు. నిర్మాతగా, నటుడిగా ఎన్నో సినిమాలు, టీవీ షోలు చేసిన నాగబాబు గత కొన్నాళ్లుగా పూర్తిగా పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో కూడా నాగబాబు కీలక పాత్ర పోషించారు.