NC 22 : సీరియస్ అయిన కన్నడ ప్రజలు.. నాగచైతన్య సినిమాకి షాక్ ఇచ్చిన కన్నడ ప్రభుత్వం..
ప్రస్తుతం నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ మాస్ అండ్ థ్రిల్లర్ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కర్ణాటకలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా కన్నడ ప్రభుత్వం ఈ చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చింది................
- Saketh U
- Published On : October 10, 2022 / 07:09 AM IST
Nagachaitanya NC 22 movie shooting stop by Kannada government
NC 22 : నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి థ్యాంక్యూ సినిమాతో పరాజయం చూశాడు. ప్రస్తుతం నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ మాస్ అండ్ థ్రిల్లర్ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కర్ణాటకలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా కన్నడ ప్రభుత్వం ఈ చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చింది.
కర్ణాటక మేలుకోట సమీపంలో ఆ జిల్లా అధికారుల నుండి షూటింగ్ కి అనుమతులు తీసుకున్నారు చిత్ర యూనిట్. అయితే అక్కడ రాజగోపురం తరహాలో మద్యం విక్రయకేంద్రం సెట్ వేసి, మద్యం సీసాలను ఉంచి చిత్రీకరణ చేయసాగారు. దీంతో లోకల్ లో ఉన్న కన్నడ ప్రజలు గుడిలాగా పెట్టి మద్యం అమ్మడం ఏంటి అంటూ సీరియస్ అయ్యారు. అధికారులకి, పోలీసులకి కంప్లైంట్ చేశారు.
BiggBoss 6 Day 35 : దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఎంట్రీ.. బిగ్‌బాస్ నుంచి చలాకి చంటి అవుట్..
ఆల్రెడీ కొన్ని షరతులతోనే అక్కడి అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే చిత్ర యూనిట్ వారు పెట్టిన నిబంధనల్ని ఉల్లంఘించారని దీంతో కర్ణాటక ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని షూటింగ్ కి ఇచ్చిన అనుమతులని రద్దు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రస్తుతం షూటింగ్ ఆపేసింది చిత్ర యూనిట్.
