Naga Chaitanya : జులై 8న ‘థ్యాంక్యూ’ చెప్తాను అంటున్న చైతూ..
సంక్రాంతికి తన తండ్రితో కలిసి బంగార్రాజు సినిమాతో భారీ విజయం సాధించాడు నాగ చైతన్య. సమంతతో విడాకుల తర్వాత కెరీర్ మీద బాగా ఫోకస్ చేసి...................
- Saketh U
- Published on- May 14, 2022 / 02:16 PM IST
Thankyou
Naga Chaitanya : సంక్రాంతికి తన తండ్రితో కలిసి బంగార్రాజు సినిమాతో భారీ విజయం సాధించాడు నాగ చైతన్య. సమంతతో విడాకుల తర్వాత కెరీర్ మీద బాగా ఫోకస్ చేసి వరుస సినిమాలు చేస్తున్నాడు చైతన్య. ఇటీవలే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో రాశిఖాన్నా హీరోయన్ గా నటించగా మాళవికా నాయర్, అవికా గోర్‌లు ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి నాగ చైతన్య కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. థ్యాంక్యూ సినిమా జులై 8న థియేటర్లలో విడుదల కానుంది అని పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని నాగ చైతన్య అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.
Siddharth : అలాంటి రోల్స్ వస్తేనే బాలీవుడ్ కి వస్తాను..
ప్రస్తుతం చైతూ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే అమెజాన్ ఓటీటీ కోసం దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక చైతన్య బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్న లాల్ సింగ్ చద్దా సినిమా కూడా ఆగస్టులో రిలీజ్ కానుంది. దీంతో ఒకే సంవత్సరం చైతన్య మూడు సినిమాలు రిలీజ్ చేసినట్టు అవుతుంది.
