Nagarjuna : ‘తల’ సినిమా ఫస్ట్ టికెట్ కొన్న కింగ్ నాగార్జున..

డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తల అనే సినిమాని తన దర్శకత్వంలోనే తెరకెక్కించారు.

Nagarjuna Buys Amma Rajasekhar Son Amma Raagin Raaj Thala Movie First Ticket

Nagarjuna : స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తల అనే సినిమాని తన దర్శకత్వంలోనే తెరకెక్కించారు. దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తల’ సినిమా రేపు ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. అంకిత నస్కర్ హీరోయిన్ గా, రోహిత్, ఎస్తేర్ నోరన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..

తాజాగా కింగ్ నాగార్జున బుక్ మై షోలో తల సినిమా ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేశారు. మూవీ యూనిట్ నాగార్జునను కలవడంతో ట్రైలర్ ను చూసి మొదటి టికెట్ ని ఆన్లైన్ లో కొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ పెద్ద హీరో అవ్వాలి. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అమ్మ రాజశేఖర్ నాకెప్పట్నుంచి పరిచయం. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని అన్నారు.

Also Read : Manchu Manoj : మంచు మనోజ్ సంచలనం.. నన్ను తొక్కాలంటే ఎవరి వల్ల కాదని కామెంట్

ఇక తన కొడుకు మొదటి సినిమా మొదటి టికెట్ కొన్నందుకు నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు అమ్మ రాజశేఖర్.