Manchu Manoj : మంచు మనోజ్ సంచలనం.. నన్ను తొక్కాలంటే ఎవరి వల్ల కాదని కామెంట్

చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడుపోవడానికి ..నేను కాయో ...పండునో కాదు.... మీ మనోజ్ ని.

Manchu Manoj : మంచు మనోజ్ సంచలనం.. నన్ను తొక్కాలంటే ఎవరి వల్ల కాదని కామెంట్

Updated On : February 13, 2025 / 9:06 PM IST

Manchu Manoj : జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ సంచలన కామెంట్స్ చేశారు. నన్ను తొక్కాలంటే ఎవరి వల్ల కాదన్నారు. ఓ కాజ్ కోసం నిలబడ్డప్పుడు న్యాయం జరిగే వరకు అది వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. అది బయటి వాళ్లైనా సరే.. నా వాళ్లైనా సరే.. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని మనోజ్ అన్నారు. నా సూడెంట్స్ కోసం నిలబడ్డాను, నా ప్రాణం ఉన్నంత వరకు నిలబడతాను అని మనోజ్ చెప్పారు.

Also Read : లైలా వివాదం.. క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, వాడిని మాత్రం వదిలేది లేదని వార్నింగ్..

”నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎంతమంది తొక్కాలని చూసినా.. బురద చల్లాలని చూసినా.. ఆ నాలుగు గోడల మధ్యకు రానియ్యకపోయినా.. నన్ను ఏం చేసినా.. ప్రజల గుండెల్లో నుంచి నన్ను తియ్యలేరని నేను గట్టిగా నమ్ముతాను.

మీరే నా దేవుళ్లు, మీరే నా కుటుంబం .. మీరే నాకు అన్నీ.. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడుపోవడానికి ..నేను కాయో …పండునో కాదు…. మీ మనోజ్ ని. మంచు మనోజ్ ని తొక్కుదామని చూస్తారా…? నలుపుదామని చూస్తారా….? నన్ను తొక్కాలన్నా …. లేపాలన్నా అభిమానుల వల్లే అవుతుంది… ఇంకెవడి వల్ల కాదు…. ఈ ప్రపంచంలో… ఈరోజు కాదు…. నన్ను ఎప్పటికీ ఆపలేరు” అని మనోజ్ అన్నారు.