Nagarjuna : హాలీవుడ్ లో చేస్తున్నారు.. మనం ఎందుకు చేయలేకపోతున్నాం.. లెనిన్ సక్సెస్ మీట్‌లో ఫైర్ అయిన నాగార్జున..
ఈ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ..(Nagarjuna)
- Saketh U
- Updated on- July 20, 2026 / 08:20 PM IST
Nagarjuna
Nagarjuna : ఇటీవల అఖిల్ లెనిన్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే రెండు సక్సెస్ మీట్స్ నిర్వహించగా నేడు లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం పేరుతో మరో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అఖిల్ తో పాటు నాగచైతన్య, నాగార్జున కూడా హాజరయి సందడి చేసారు.
Also Read : Naga Chaitanya : నా బేబీ సిసింద్రీకి హిట్.. లెనిన్ సక్సెస్ మీట్ లో నాగచైతన్య ఎమోషనల్ స్పీచ్..
ఈ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ టైంకి రెండు వారాల ముందు అడిగారు కానీ ఇవ్వలేకపోయాము. ఇస్తే ఇంకా బాగా అవుట్ పుట్ వచ్చేది. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా సాంకేతిక నిపుణులు, డైరెక్టర్స్, సంగీత దర్శకులు.. అందరికి మీరు ఏ సినిమాని అయినా ఒక రెండు వారాల ముందే ఫైనల్ కాపీ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ కి ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఈ సినిమాకు చివరి నిమిషంలో నేను, డైరెక్టర్, ఎడిటర్ కూడా కరెక్షన్స్ చేస్తూ కూర్చున్నాం. ఒక్కరిని కాదు అందరూ కలిసి రెండు వారాల క్రితం ఇస్తే సినిమాని ఇంకా పైకి తీసుకెళ్లొచ్చు.
ఒడిస్సి అనే హాలీవుడ్ సినిమా సంవత్సరం క్రితం రిలీజ్ డేట్ ఇచ్చి చెప్పిన డేట్ కి రిలీజ్ చేసారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. ఇచ్చినా ఎందుకు వాయిదా వేస్తున్నాం. నేను కూడా రిలీజ్ డేట్ ఇచ్చాను కానీ వాయిదా వేసాను. జూన్ 26 రిలీజ్ అవ్వాలి. కానీ సాంకేతికంగా అవ్వలేదు సినిమా. బెటర్ క్వాలిటీ రావాలి అందుకే వాయిదా వేసాము. అందరికి చెప్తున్నా ఇది రిక్వెస్ట్. ఒకప్పుడు నెల రోజుల క్రితమే రిలీజ్ కాపీ రెడీ అయ్యేది. ఇప్పుడు ఎందుకు చెయ్యలేకపోతున్నారు. ఇది చేస్తే బాగుంటుంది అందరికి.
ఈ ప్రేమ, ఈ అరుపులు కోసం అఖిల్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నాడు. మీకు ఎలా ఉందో తెలీదు కానీ నాకు, చైతూకి, అఖిల్ కి పండగలా ఉంది. ఇల్లంతా కళకళలాడుతుంది. మేము రివ్యూస్, సోషల్ మీడియా గురించి ఆలోచించము, పట్టించుకోము. మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి సినిమా బాగుంది, షోస్ పెంచుతున్నాము అని చెప్తేనే హిట్ అయినట్టు. ఈ సినిమాకు అది మేము విన్నాము అని అన్నారు.
