Nagarjuna : పవన్ కోసం తన సినిమా టైటిల్ ఇచ్చేసిన నాగార్జున.. ఆ సినిమాతోనే పవన్ కి యూత్‌లో ఫాలోయింగ్..
పవన్ కళ్యాణ్ సినిమాకు నాగార్జున దగ్గర ఉన్న టైటిల్ తీసుకున్నారు. (Nagarjuna)
- Saketh U
- Published On : April 11, 2026 / 07:49 AM IST
Nagarjuna
Nagarjuna : సినీ పరిశ్రమలో మూవీ టైటిల్స్ మారుతూనే ఉంటాయి. లేదా ఒక హీరో దగ్గరున్న మూవీ టైటిల్ ఇంకొకరు తీసుకుంటారు. ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయిన టైటిల్ ఎవరికైనా కావాల్సి వస్తే రిక్వెస్ట్ చేసి లేదా డబ్బులిచ్చి తీసుకుంటారు. ఇది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాకు నాగార్జున దగ్గర ఉన్న టైటిల్ తీసుకున్నారు.
తొలిప్రేమ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత వెంటనే అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ సినిమా మొదలుపెట్టారు. అదే తమ్ముడు సినిమా. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో సాంగ్స్, పవన్ కళ్యాణ్ స్టైల్, కామెడీ యూత్ కి పవర్ స్టార్ కి మరింత దగ్గర చేసాయి. అయితే తమ్ముడు టైటిల్ మొదట నాగార్జున దగ్గర ఉంది.
Also Read : Dhurandhar 2 : సరికొత్త రికార్డ్ సెట్ చేసిన ధురంధర్.. ఆ లిస్ట్ లో ఫస్ట్ సినిమా..
నాగార్జున, హరికృష్ణ కలిసి అన్నదమ్ముల అనుబంధం కథతో సినిమా అనుకున్నారు. ఆ సినిమాకు మొదట తమ్ముడు టైటిల్ అనుకోని ఆ టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. కానీ పవన్ కళ్యాణ్ కోసం అని నిర్మాత శివ రామకృష్ణ అడగడంతో ఇచ్చేసారు. అనంతరం తమ సినిమాకు సీతారామరాజు అనే టైటిల్ పెట్టుకున్నారు. కట్ చేస్తే సీతారామరాజు, తమ్ముడు రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.
