Nagarjuna Hello Brother: ‘హలో బ్రదర్’ సీక్వెల్.. అఖిల్‌తో ప్లానింగ్.. నాగార్జున కామెంట్స్ వైరల్..

లెనిన్ సినిమా జులై 10న రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తిరుపతిలో ఘనంగా జరిగింది. (Hello Brother Sequel)

  • Updated on- July 6, 2026 / 04:44 PM IST

Nagarjuna Comments On Hello Brother Sequel with Akhil

Hello Brother Sequel: నాగార్జున నటించిన సూపర్‌హిట్ సినిమాల్లో ‘హలో బ్రదర్’ ఒకటి. ద్విపాత్రాభినయంతో నాగార్జున తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా టాలీవుడ్ క్లాసిక్ గా నిలిచింది. అయితే తాజాగా హలో బ్రదర్ సీక్వెల్‌పై నాగార్జున వ్యాఖ్యలు చేసారు. అఖిల్ నటించిన లెనిన్ సినిమా జులై 10న రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తిరుపతిలో ఘనంగా జరిగింది.

ఈ ఈవెంట్లో యాంకర్ సుమ నాగార్జునతో మీ సినిమాల్లో ఏ సినిమాకు సీక్వెల్ అఖిల్ తో చేస్తారు అని అడగ్గా.. నాగార్జున మాట్లాడుతూ.. హలో బ్రదర్ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుంది. అఖిల్ తో ఆ సినిమా చేయొచ్చు. అందులో ఇంకో హీరోగా నేను కూడా నటిస్తాను అని అన్నారు. దీంతో హలో బ్రదర్ సినిమాకు సీక్వెల్ అఖిల్ డ్యూయల్ రోల్ గా, నాగార్జున గెస్ట్ పాత్రలో ప్లాన్ చేయొచ్చు అని తెలుస్తుంది. మరి దీనిపై ఎవరైనా కథ రాసి తీసుకెళ్తారా చూడాలి.

Also Read – Satluj : మూడు పేర్లు.. నాలుగేళ్ల వివాదం.. విడుదలైన 48 గంటల్లోనే ఓటీటీ నుంచి మాయం.. ‘సత్లుజ్’ సినిమా వెనుక అసలు కథ ఇదే!

హలో బ్రదర్ సినిమా 1994లో రిలీజయింది. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా రమ్యకృష్ణ, సౌందర్య జంటగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.