బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌లోనూ హోస్ట్‌గా హీరో నాగార్జున.. టీజర్‌ విడుదల.. ఫన్ మొదలు

దానిని సత్య తాకినప్పుడు పొగ వస్తుంది. నాగార్జున వరాలు ఇచ్చే జీనీలా కనపడ్డారు.

Pic: Star maa

Bigg Boss 8: బిగ్‌బాస్‌-8 తెలుగు సీజన్‌లోనూ హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బిగ్‌బాస్‌ 8 టీజర్‌ను స్టార్ మా ఇవాళ విడుదల చేసింది. చాలా ఫన్నీగా ఈ టీజర్‌ను రూపొందించారు. కమెడియన్‌ సత్య పాత్ర, నాగార్జున ఈ టీజర్‌లో కనపించారు.

ఇందులో దొంగగా దర్శనమిచ్చిన సత్య తన భార్యతో ఫోనులో మాట్లాడతాడు. పురాతన వస్తువులు ఉన్న షాపులో వాటిని చోరీ చేస్తున్నానని చెబుతాడు. టిప్పు సుల్తాన్ కత్తి, మోనాలిసా అద్దంతో పాటు అనేక ఆకర్షణీయమైన వస్తువుల గురించి ఫన్నీగా వివరిస్తాడు. ఆ సమయంలో ఒక్కసారిగా అక్కడి మాయా దీపం కదులుతుంది.

దానిని సత్య తాకినప్పుడు పొగ వస్తుంది. నాగార్జున వరాలు ఇచ్చే జీనీలా కనపడ్డారు. వరాలు ఇచ్చే కింగ్‌… ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు అని నాగార్జున అన్నారు. బిగ్‌బాస్-8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇందులో చెప్పలేదు. కంటెస్టెంట్‌లుగా ఎవరెవరు కనపడతారన్న ఆసక్తి నెలకొంది. ఇందులో పాల్గొంటున్నారంటూ ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారమవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు