NBK 105 ‘రూలర్’ ఫిక్స్!

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘NBK 105’ టైటిల్ ‘రూలర్’..

  • Publish Date - October 16, 2019 / 05:55 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘NBK 105’ టైటిల్ ‘రూలర్’..

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘NBK 105’ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమా నుండి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌కి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. బాలయ్య లుక్ అండ్ మేకోవర్ చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. దసరా సందర్భంగా రిలీజ్ చేసిన బాలయ్య లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చెయ్యకుండా పోస్టర్స్‌తోనే సరిపెడుతున్నాడని నిర్మాత సి.కళ్యాణ్‌పై కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమా ప్రారంభోత్సవం రోజే నిర్మాత టైటిల్ ప్రకటించారు. సినిమా పేరు ‘రూలర్’ అని, సంక్రాంతికి విడుదల చేస్తామని, ‘జైసింహ’ కంటే మంచి సినిమా.. చాలా పెద్ద మాస్ సినిమా బాలయ్య అభిమానులకు  ఇస్తామని నిర్మాత చెప్పారు. దీంతో  ‘NBK 105’ టైటిల్ ‘రూలర్’ అని ఫిక్స్ అయిపోయింది.

Read Also : ‘రొమాంటిక్’లో రమ్యకృష్ణ

వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌కాగా, భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. కథ : పరుచూరి మురళి, మాటలు : ఎమ్.రత్నం, సంగీతం : చిరంతన్ భట్, ఆర్ట్ : చిన్నా, కెమెరా : సి. రామ్ ప్రసాద్, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్..